లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్తున్నారు. ఇవాళ ( సోమవారం ) మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో ఆయన పార్టీలోకి చేరబోతున్నారు. బీజేపీ అనేది మా రక్తంలోనే ఉందన్నారు. అయితే, తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా ఆయన రెడీ అయ్యారు. మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ పార్టీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తానని గాలి జనార్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Astrology: మార్చి 25, సోమవారం దినఫలాలు
కాగా, 2022లోనే జనార్థన్ రెడ్డి స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్పీపీ)ని బీజేపీలో విలీనం చేయడానికి పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆయనతో పాటు కేర్పీపీ నేతలంతా బీజేపీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ విలీన విషయమై.. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు కూడా ఆయన చేశారు. ఇక, నేడు (సోమవారం) విజయేంద్ర సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. చిత్రదుర్గ, గుల్బర్గా, కొప్పల్, రాయచూర్, బళ్లారి, విజయనగరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు తన నిర్ణయానికి మద్దతు ఇచ్చారు అని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: Ramya Krishnan: రమ్యకృష్ణ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
అయితే, మాజీ మంత్రి శ్రీరాములుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని గాలి జనార్థన్ రెడ్డి చెప్పారు. బళ్లారి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు మద్దతిస్తానన్నారు. కాగా, బీఎస్ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రిగా పని చేశారు. అయితే, గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జైలుకు వెళ్లాగా.. ఆ తర్వాత బీజేపీకి దూరం అయ్యారు.. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు.
