Gadwal Murder: తెలంగాణాలో సంచలనం సృష్టించిన గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సంబంధించిన ప్రధాన నిందితుడుగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుగా పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్ కేసు సంబంధించి పోలీసుల విచారణనలో తిరుమలరావు తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు తెలిసింది.
Read Also:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్న కామారెడ్డి నేతలు..!
ఇకపోతే గత కొంతకాలంగా తిరుమలరావు, ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా.. తిరుమలరావుకు పెళ్లై 8 ఏళ్లవుతున్న సంతానం లేకపోవడంతో, ఐశ్వర్యతో పిల్లలు కనాలని అనుకున్నాడు. దీనితో జీవితంలో అడ్డుగా ఉన్న తన భార్యతో పాటు, సర్వేయర్ తేజేశ్వర్ ను కూడా అడ్డు తొలగించాలనుకున్నాడు. ఈ కారణంగానే తేజేశ్వర్ ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ ను నియమించినట్టు సమాచారం. అలాగే తిరుమలరావు భార్యను చంపి ప్రియురాలితో విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు.
Read Also:Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !
తన భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకొని, ముందుగా లడఖ్ వెళ్లి అక్కడినుండి విదేశాలకు వెళ్లి సెటిల్ అవుదామని.. అందుకోసం విమాన టిక్కెట్లు కూడా సిద్ధం చేసుకున్నాడు తిరుమలరావు. ఇలా తనపని కావడానికి అడ్డుగా ఉన్న భార్యను చంపేద్దామని నిర్ణయించుకోగా, భర్త కుట్రను ముందే పసిగట్టిన భార్య జాగ్రత్త పడింది. దానితో తేజేశ్వర్ ను చంపుదామని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు రూ.20 లక్షలు లోన్ తీసుకొని అందులో రూ.2 లక్షలు తేజేశ్వర్ ను హత్య చేసిన గ్యాంగుకు ఇచ్చాడని, మిగతా రూ.18 లక్షలు సీజ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఐశ్వర్యకు తిరుమలరావుతో ఉన్న సంబంధం నచ్చక పలుమార్లు తన తల్లి, చెల్లి చెప్పినా వినకపోవడంతో.. అన్న నవీన్ తిట్టేవాడని తెలిపిన స్థానికులు తెలిపారు. అయితే ఇటీవల ఇంట్లో ఐశ్వర్య అన్న నవీన్ జారిపడి మరణించాడని తెలిసింది. అయితే ఇప్పుడు ఆ మృతిపైన కూడా అనుమానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
