తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కొద్దిక్షణాల్లో ప్రారంభం కానుంది. ఈ వేడుక హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, పలువురు సినీ, సాహిత్య, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. విజేతలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా భారీ మొత్తంలో నగదు బహుమతులు అందజేస్తున్నారు.
రేవంత్ రెడ్డి వెళ్లిపోయిన అనంతరం భట్టి, బాలకృష్ణ చేతుల మీదుగా 2021-2023 సినిమాల వారికీ అవార్డులు అందించారు .
రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2014-2020 సినిమాల వారికీ అవార్డులు అందించారు .
ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్ ఇద్దరికీ ఆత్మీయ సత్కారం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క చేతులమీదుగా జరిగింది.
గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ గద్దర్, ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కు అనౌన్స్ చేసిన మూడు కోట్ల రూపాయలు చెక్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
యండమూరి వీరేంద్రనాథ్ రఘుపతి వెంకయ్య అవార్డుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు.
న్నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డుని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు.
బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డును సుకుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పైడి జయరాజ్ ఫిలిం అవార్డును దర్శకుడు మణిరత్నం అందుకున్నారు.
ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు నందమూరి బాలకృష్ణ రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ బెస్ట్ హీరోగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో 35 చిన్న కథ కాదు సినిమాకి గాను నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో కల్కి 2898 ఏడీ సినిమాకి గాను దర్శకుడు నాగ్ అశ్విన్ బెస్ట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో కల్కి 2989 ఏడీ సినిమా ప్రథమ ఉత్తమ చిత్రంగా నిలవడంతో దర్శకుడు, హీరో, నిర్మాతలకు అవార్డులు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోట్టెల్ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలవడంతో దర్శకుడు, హీరో, నిర్మాతలకు అవార్డులు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో లక్కీ భాస్కర్ సినిమా తృతీయ ఉత్తమ చిత్రంగా నిలవడంతో దర్శకుడు, హీరో, నిర్మాతలకు అవార్డులు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో కమిటీ కుర్రోళ్ళు సినిమాకి గాను యదు వంశీ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు గెలుచుకోగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో మత్తు వదలరా 2 సినిమాకి గాను ఫారియా అబ్దుల్లాకి తానూ పాడిన రాప్ సాంగ్ కోసం స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకోగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో రాజు యాదవ్ సినిమాకి గాను రాజేష్ కల్లెపల్లి, ప్రశాంత్ రెడ్డి నిర్మాతలుగా స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకోగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దర్శకుడు ఆ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో క సినిమాకి గాను సుజీత్-సందీప్ దర్శకులుగా స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెలుచుకోగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో పొట్టెల్ సినిమాకి గాను అనన్య నాగళ్ళ స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెలుచుకోగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో లక్కీ భాస్కర్ సినిమాకి గాను దుల్కర్ సల్మాన్ స్పెషల్ జ్యూరీ గెలుచుకోగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాగవంశీ ఆ అవార్డు అందుకున్నారు.
బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ కేటగిరీలో రజాకార్ సినిమాకి అవార్డు దక్కడంతో నిర్మాత నారాయణ రెడ్డి, దర్శకుడు యాతా సత్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 వేడుకలో మంగ్లీ లైవ్ పెర్ఫార్మన్స్
కమిటీ కుర్రాళ్ళు సినిమా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ సినిమాగా నిలవడంతో టీం అవార్డు అందుకున్నారు. నిర్మాతకు ఐదు లక్షలు, దర్శకుడికి మూడు లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా అందుకున్నారు.
ఆయ్ సినిమా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ హోల్సం ఎంటర్టైనర్ సినిమాగా నిలవడంతో టీం అవార్డు అందుకున్నారు. మూడు లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా 35 చిన్న కధ కాదు సినిమా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలింగా నిలవడంతో టీం అవార్డు అందుకున్నారు. మూడు లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా సరిపోదా శనివారం సినిమాకు గాను ఎస్జే సూర్య తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. మూడు లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాకు గాను శరణ్య ప్రదీప్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నారు. 3 లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగారజాకార్ సినిమాకు గాను భీమ్స్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ఐదు లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా పుష్ప 2 సినిమాకు గాను శ్రేయ ఘోషాల్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు అందుకోవడానికి రాలేదు, ఊరి పేరు భైరవ కోన సినిమాకు గాను బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు అందుకున్నారు. ఐదు లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా మత్తు వదలరా 2 సినిమాకు గాను సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరూ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ కమెడియన్స్ అవార్డు అందుకున్నారు. చెరో రెండున్నర లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటోలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా గాంగ్స్టార్ సినిమాకు గాను యాక్షన్ కొరియోగ్రఫీ చేసినందుకు కె. చంద్రశేఖర్ రాధోడ్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు.
జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా దేవర సినిమాకు గాను ఆయుధ పూజ కొరియోగ్రఫీ చేసినందుకు గణేష్ ఆచార్య తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో జయజయహే గీతాన్ని లైవ్ లో పర్ఫార్మ్ చేసిన కీరవాణి
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల నిధులు మంజూరు
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా 2014-2023 జ్యూరీ కమిటీ మెంబర్లు ఊహ, డైరెక్టర్ ఉమా మహేశ్వర్ రావు , వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, మధుర శ్రీధర్, జయసుధ, సహా మిగతా వారికి గోల్డ్ మొమెంటో అందచేశారు.
అల్లు అర్జున్, బాలకృష్ణలను హత్తుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే సమయానికి ఎంట్రీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా 2014-2023 జ్యూరీ కమిటీ మెంబర్ దశరధ్, డీవీకే రాజులకు చిరు సత్కారం, గోల్డెన్ మొమెంటో ప్రధానము
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా 2014-2023 జ్యూరీ కమిటీ చైర్మన్ మురళీ మోహన్ కి చిరు సత్కారం
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 లో థమన్ లైవ్ పెర్ఫార్మెన్స్
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా 35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్ సినిమాలకు అరుణ్ దేవ్, హారిక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2024 అందుకున్నారు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్(చెరో రెండున్నర లక్షలు), ప్రశంసా పత్రాలు అందుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి శివపాలడుగు బెస్ట్ స్టోరీ రైటర్ గా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2024 అందుకున్నారు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రం అందుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా రాజు యాదవ్ సినిమాకి చంద్రబోస్ బెస్ట్ లిరిక్ రైటర్ గా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2024 అందుకున్నారు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రం అందుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా లక్కీ భాస్కర్ సినిమాకి వెంకీ అట్లూరి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2024 అందుకున్నారు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రం అందుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా ;లక్కీ భాస్కర్ సినిమాకి నవీన్ నూలి బెస్ట్ ఎడిటర్ గా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2024 అందుకున్నారు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రం అందుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా గామి సినిమాకి అరవింద్ మీనన్ బెస్ట్ ఆడియోగ్రాఫర్ గా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2024 అందుకున్నారు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రం అందుకున్నారు
డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా కల్కి 2989 ఏడీ సినిమాకి గాను అర్చనారావు, అజయ్ కుమార్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజనైర్లుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ 2024 అందుకున్నారు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రం అందుకున్నారు