Gunfire : హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి 1) కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. పాత నేరస్తుడి అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న ప్రిజం పబ్‌ను చేరుకున్నారు. అయితే, పోలీసుల రాకను గమనించిన నిందితుడు క్షణాల్లో స్పందించి తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఒకటి పబ్‌లో పనిచేసే బౌన్సర్‌కు, మరొకటి కానిస్టేబుల్ వెంకట్‌రామ్‌రెడ్డికి తగిలి గాయాలయ్యాయి.
Dil Raju :‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నాకు గుణపాఠం నేర్పింది.. దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆందోళనకరమైన ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొన్న పోలీసులు చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనిపై నేరపూరిత చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ నిందితుడు పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు చేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సంఘటన గచ్చిబౌలిలో తీవ్ర కలకలం రేపింది.
Delhi Polls: ఎన్నికల ముందు ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు..