Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gachibowli Illegal Buildings: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ నిర్మాణాల దందా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అతను నిర్మించిన భవనాలన్నీ పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాలని తేల్చిచెప్పారు. గతంలో ఓ సాధారణ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్ ఖాన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో సైబరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్నే సృష్టించాడు. అత్యంత చిన్న స్థలాలను కొనుగోలు చేసి, అధికారులకు లంచాలు ఎరవేస్తూ పరిమితికి మించిన అంతస్తులను నిర్మించాడు. వాటిని పీజీ హాస్టళ్లుగా మర్చి, అమాయక విద్యార్థులు, ఉద్యోగుల నుంచి భారీగా అద్దెలు వసూలు చేస్తూ అనతికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు.
బిల్డర్ సాజిద్ అక్రమాలపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పరిధిలో సాజిద్ నిర్మించిన అన్ని అక్రమ కట్టడాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు, అతని అక్రమ వ్యాపారానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల జాబితాను కూడా మున్సిపల్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇక మరోవైపు, ప్రమాద స్థలంలో శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం నేలమట్టం అయిన బిల్డింగ్ శిథిలాలు తొలగించిన తర్వాత వెనక ఉన్న అక్రమ కట్టడం G+6 భవనం కూల్చివేయనున్నారు. ఇప్పటికే జయదర్శిని అపార్ట్ మెంట్ C బ్లాక్ వాసులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బిల్డింగ్ యజమాని సాజిద్ పరారీలో ఉన్నాడు. ఇప్పటికే సాజిద్‌పై కేసు నమోదు చేశారు.
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!