NTV Telugu Site icon

Gaami Twitter Review: ‘గామి’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ మంచి హిట్ కొట్టాడు!

Gaami Twitter Review

Gaami Twitter Review

Vishwak Sen and Chandini Chowdary’s Gaami Twitter Review: విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’. కొత్త దర్శకుడు విద్యాధర్‌ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ శబరీష్‌ ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించనున్నాడు. ట్రైలర్‌తో బజ్ మరింత పెరిగింది. సరికొత్త కథతో వస్తున్న గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా నేడు థియేటర్లోకి వచ్చింది.

ఇప్పటికే గామి మూవీని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘విజువల్ వండర్. అత్యంత ఆసక్తికరమైన సినిమా. అద్భుతమైన సంగీతం. అన్నా ఎంకొట్టి తీశారు అన్న గామి. పక్కా నేషనల్ అవార్డ్.. ఫిక్స్ అయిపొండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అందరూ ఈ సినిమాను ఎలా తీసుకుంటారో తెలియదు. ఓపికతో రెండవ సగం చూస్తే బాగుంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. సెకండాఫ్ యావరేజ్‌గా ఉంది. స్టోరీ లైన్ అద్భుతంగా.. బీజీఎం నెక్ట్స్ లెవెల్లో ఉంది. సెకండాఫ్‌లోని చివరి 30 నిమిషాలే సినిమాను కాపాడేస్తుంది’ అని మరో ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

Also Read: Maha Shivratri : శివరాత్రి పూజా విధానం.. శుభ సమయం ఇదే

‘ఇప్పుడే గామి సినిమా చూశా. ఇలాంటి స్టోరీ నమ్మి ఐదేళ్లు కష్టపడ్డ కార్తిక్‌కు హ్యాట్సాఫ్. విద్యాధర్ ఇలాంటి అవుట్ పుట్ కోసం చాలానే కష్టపడ్డాడు. సినిమాటోగ్రఫీ అత్యుత్తమంగా ఉంది, ఆర్ఆర్ బాగుంది.. స్క్రీన్ ప్లే పర్లేదు’, ‘ఫస్ట్ హాఫ్ బాగుంది.. సెకండాఫ్ కాస్త స్లోగా ఉంది. అసలైన సీక్వెన్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా సినిమా సూపర్. బెస్ట్ విజువల్స్, రీసెంట్ టైంలో ఇదే బెస్ట్ సినిమాటోగ్రఫీ. సినిమాను తప్పకుండా చూడొచ్చు’ అని ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తానికి గామి మూవీకి మంచి మార్కులే పడ్డాయి. విశ్వక్‌ సేన్‌ మంచి హిట్ కొట్టినట్టే.

Show comments