NTV Telugu Site icon

G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. భారత్‌కు చేరుకున్న చైనా ప్రధాని లీ కియాంగ్

G20 Summit

G20 Summit

G20 Summit 2023 LIVE UPDATES: జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాక ఢిల్లీలో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 40 మంది ప్రపంచ చేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

The liveblog has ended.
  • 08 Sep 2023 10:18 PM (IST)

    భారత్ చేరుకున్న నెదర్లాండ్ ప్రధాని

    నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి మార్క్ రూట్టే జీ-20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 10:15 PM (IST)

    ఢిల్లీ చేరుకున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు

    బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా G-20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 09:25 PM (IST)

    భారత్‌కు చేరుకున్న చైనా ప్రధాని లీ కియాంగ్

    పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రధాని లీ కియాంగ్ G-20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు.

     

  • 08 Sep 2023 09:22 PM (IST)

    భారత్ చేరుకున్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు

    జీ-20 సదస్సు కోసం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా ఢిల్లీ చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 09:19 PM (IST)

    భారత్ విచ్చేసిన సింగపూర్ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌

    జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ ఢిల్లీ చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 08:38 PM (IST)

    ప్రధాని మోడీతో జో బైడెన్ ద్వైపాక్షిక సమావేశం

    ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక చర్చలో కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. భారత్‌లో జెట్ ఇంజిన్‌లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం లాంటి అంశాలపై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు సమాచారం.

     

  • 08 Sep 2023 08:34 PM (IST)

    భారత్‌లో అడుగుపెట్టిన ఇండోనేషియా అధ్యక్షుడు

    జీ-20 సదస్సు కోసం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఢిల్లీ చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 08:33 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న టర్కీ ప్రెసిడెంట్

    టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ జి-20 సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్నారు. 

     

  • 08 Sep 2023 08:31 PM (IST)

    భారత్ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

    జీ-20 సదస్సు కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు.

     

  • 08 Sep 2023 07:42 PM (IST)

    భారత్‌లో అడుగుపెట్టిన యూఏఈ అధ్యక్షుడు

    జీ20 సమ్మిట్ కోసం యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఢిల్లీకి చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 07:38 PM (IST)

    హోటల్‌కు బయలుదేరిన అమెరికా ప్రెసిడెంట్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ-20 సమ్మిట్ కోసం ఢిల్లీకి వచ్చిన తర్వాత హోటల్‌కు బయలుదేరారు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.

     

  • 08 Sep 2023 07:07 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

    ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. బైడెన్‌కు స్వాగతం పలికిన విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే.సింగ్‌. బైడెన్‌కు అరుదైన గౌరవాన్ని ఇవ్వనున్న ప్రధాని మోడీ. మోడీ నివాసంలో అమెరికా అధ్యక్షుడికి ప్రైవేట్‌ డిన్నర్‌. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా మోడీ నివాసానికి బైడెన్‌. ఇప్పటివరకు ప్రధానిగా ఏ దేశ అధ్యక్షుడికీ, ఏ దేశ ప్రధానికీ తన నివాసంలో విందు ఇవ్వని మోడీ.

     

  • 08 Sep 2023 06:25 PM (IST)

    ప్రధాని మోడీతో బంగ్లాదేశ్‌ పీఎం ద్వైపాక్షిక చ‌ర్చలు

    ఢిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్‌తో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి, అభివృద్ధి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశం చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

     

  • 08 Sep 2023 06:19 PM (IST)

    ఢిల్లీ చేరుకున్న ఈజిప్ట్ అధ్యక్షుడు

    జీ-20 సమ్మిట్ కోసం ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ అల్-సిసి ఢిల్లీకి చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 06:18 PM (IST)

    ఢిల్లీ చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

    దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 05:31 PM (IST)

    ప్రధాని మోడీ, మారిషస్ పీఎం ద్వైపాక్షిక చర్చలు

    భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ ఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై వారు చర్చించారు.

     

  • 08 Sep 2023 04:07 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్

    జీ20 సదస్సు కోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ విమానాశ్రయంలో కళాకారులు సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు.

     

  • 08 Sep 2023 04:04 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్

    జీ20 సదస్సు కోసం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో కళాకారులు సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు.

     

     

  • 08 Sep 2023 04:02 PM (IST)

    జీ20 సదస్సు కోసం ఢిల్లీకి ఒమన్‌ ఉపప్రధాని

    ఒమన్ ఉపప్రధాని, సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు.

     

  • 08 Sep 2023 03:49 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా

    భారతదేశంలో జీ20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఢిల్లీకి చేరుకున్నారు.రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో కళాకారులు సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు.

     

  • 08 Sep 2023 03:45 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా

    జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఢిల్లీకి చేరుకున్నారు.

     

     

  • 08 Sep 2023 03:42 PM (IST)

    ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

    దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 40 మంది ప్రపంచ చేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

     

  • 08 Sep 2023 03:00 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న పలు దేశాల నేతలు

    యూకే ప్రధాని రిషి సునాక్‌ కంటే ముందుగానే పలువురు దేశాల నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్మన్ అజాలి అసోమాని G20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ pr20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉక్కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీలోని ఏరోసిటీలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు

    భారత్‌ అధ్యక్షతన జరగనున్న జీ-20 సదస్సు కు హాజరయ్యేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా ఢిల్లీకి విచ్చేశారు. గురువారం రాత్రి దేశ రాజధానికి చేరుకున్న ఆమెకు భారత అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను ఆహ్వానించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్టు లో ప్రత్యేక సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను వీక్షించిన క్రిస్టాలినా కూడా సరదాగా కాలుకదిపారు.