NTV Telugu Site icon

G20 Summit Live Updates: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో విందు కార్యక్రమం

G20 Summit Live Updates

G20 Summit Live Updates

G20 Summit Live Updates: భారత్‌ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్‌ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

The liveblog has ended.
  • 10 Sep 2023 09:09 AM (IST)

    నేను ఏ తప్పూ చేయలేదు: చంద్రబాబు

    నేను ఏ తప్పూ చేయలేదు.. నాపై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారు... శనివారం ఉదయం 5.40కి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.. ఈరోజు 5.40కి రిమాండ్ రిపోర్ట్‌ ఇచ్చారు.. వాదోపవాదాలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటాను: చంద్రబాబు

  • 10 Sep 2023 08:55 AM (IST)

    కోర్టులో మాట్లాడుతున్న చంద్రబాబు

    నారా చంద్రబాబు రిమాండ్‌పై ఓపెన్ కోర్టులో విచారణ.. 409 సెక్షన్ కింద వాదనలు.. 409 సెక్షన్ పెట్టడం సబబు కాదంటున్న చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా.. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యం చూపాలంటున్న లూథ్రా.. రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరించాలని లూథ్రా నోటీసు.. తిరస్కరణపై వాదనలకు అనుమతించిన న్యాయమూర్తి.. కేసులో తన వాదనలు వినాలని కోరిన చంద్రబాబు.. కోర్టులో మాట్లాడుతున్న చంద్రబాబు

  • 09 Sep 2023 07:48 PM (IST)

    విందుకు స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి, ప్రధాని

    జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందు కోసం అతిథులు విచ్చేస్తున్నారు. వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు.

     

     

  • 09 Sep 2023 07:39 PM (IST)

    భారత్ మండపానికి చేరుకున్న ఏడీబీ ప్రెసిడెంట్

    ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా జీ20 విందు కోసం భారత్ మండపానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు.

     

  • 09 Sep 2023 07:36 PM (IST)

    రాష్ట్రపతి ఆధ్వర్యంలో విందు కార్యక్రమం.. భారత్‌ మండపానికి ద్రౌపది ముర్ము

    జీ-20 విందును నిర్వహించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ మండపానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ అతిథులకు ఆహ్వానం పలుకుతున్నారు.

     

  • 09 Sep 2023 06:37 PM (IST)

    భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం

    వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రపంచ నాయకులు శనివారం జీ20 సమ్మిట్‌లో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు. కారిడార్‌ను ప్రారంభిస్తూ, కనెక్టివిటీ, స్థిరమైన అభివృద్ధికి ఇది కొత్త దిశను ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే కాలంలో ఈ కారిడార్ భారతదేశం, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని ఆయన అన్నారు.

     

  • 09 Sep 2023 05:51 PM (IST)

    గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

    ప్రధాని నరేంద్ర మోఢీ ఢిల్లీలో 'గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్'ను ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ 'గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్'ను ప్రారంభించారు. క్లీన్ ఫ్యూయల్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి జీవ ఇంధనంపై ప్రపంచ కూటమని ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ కూటమిలో ప్రపంచమంతా చేరాలని కోరారు. ఈ చొరవలో చేరాలని భారతదేశం యావత్ ప్రపంచాన్ని ఆహ్వానిస్తోందని ప్రధాని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని అన్నారు.

     

  • 09 Sep 2023 05:22 PM (IST)

    భారత్-జపాన్ సహకారం బలోపేతంపై చర్చ

    ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ పీఎం ఫుమియో కిషిదా సమావేశమయ్యారు. కనెక్టివిటీ, వాణిజ్యం వంటి కీలక రంగాలలో భారత్-జపాన్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు. ప్రజలు-ప్రజల మధ్య సంబంధాలను పెంచడానికి కూడా వారు అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం వివరాలను వెల్లడించింది.

     

  • 09 Sep 2023 04:50 PM (IST)

    ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం: ప్రధాని మోడీ

    జీ20 సమ్మిట్‌లో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. జీ20 సమ్మిట్ ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడం దేశానికి భారీ విజయంగా భావించబడింది. ఇందులో మునుపటి సమావేశాల కంటే ఎక్కువ ఫలితాలు, రికార్డు సంఖ్యలో పత్రాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో విభజనల కారణంగా అంతర్జాతీయ సమూహాల కోసం ఏకాభిప్రాయాన్ని చేరుకోవడం ఆలస్యంగా మారింది.

    ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. "ఒక శుభవార్త ఉంది.. బృందం కృషి మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరి సహాయంతో, ఢిల్లీ G20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్ ఏకాభిప్రాయానికి చేరుకుంది" అని అన్నారు. దీనిని జీ20 నాయకులందరూ స్వీకరించాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన అభ్యర్థించారు. జీ20 కోసం సమావేశమైన విదేశీ మంత్రులు వాతావరణంతో సహా వివిధ సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని అంగీకరించారు.

     

  • 09 Sep 2023 04:38 PM (IST)

    జో బైడెన్‌తో బంగ్లా ప్రధాని షేక్ హసీనా సెల్ఫీ

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ వేదిక వద్ద కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వీరిద్దరు సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలను బంగ్లాదేశ్ హైకమిషన్‌ షేర్ చేసింది.

     

  • 09 Sep 2023 03:13 PM (IST)

    జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో మోడీ ద్వైపాక్షిక భేటీ

    ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి చర్చించారు.

     

  • 09 Sep 2023 03:11 PM (IST)

    జీ20 వేదికగా ప్రపంచ నేతల కరచాలనం

    ఢిల్లీలోని జీ-20 సమ్మిట్ వేదికగా ఉన్న భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాలు కరచాలనం చేసుకున్నారు.

     

  • 09 Sep 2023 03:07 PM (IST)

    యూకే ప్రధాని రిషి సునాక్‌తో మోడీ ద్వైపాక్షిక భేటీ

    దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతోంది. జీ20 సదస్సు మధ్యలో ప్రధాని మోడీ యూకే ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్, యూకేల మధ్య పరస్పర సహకారంపై చర్చించారు.