Site icon NTV Telugu

G-20 Countries: శ్రీ అన్న సాగు వినియోగాన్ని పెంచడానికి అంగీకరించిన జీ-20 దేశాలు

Shree Anna

Shree Anna

G-20 Countries: భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ మూడు రోజుల సమావేశంలో, సుస్థిర వ్యవసాయం కోసం జ్ఞానం, అనుభవం, ఆవిష్కరణల ప్రపంచ భాగస్వామ్యానికి శనివారం ప్రాధాన్యత ఇవ్వబడింది. శ్రీఅన్న సాగు, వినియోగాన్ని పెంచడానికి జీ-20 దేశాలు అంగీకరించాయి. ఈ సమయంలో భారతదేశం ప్రతిపాదనపై, సభ్య దేశాలు శ్రీ అన్న సాగును ప్రోత్సహించడంలో దాని వినియోగాన్ని పెంచడంలో సహకరించడానికి అంగీకరించాయి. మహిళలు, యువత భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మార్పు తీసుకురావచ్చని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు. జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

Also Read: International Yoga Day: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. న్యూయార్క్‌లో వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం..!

హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు. వారణాసి సమావేశంలో ఇంటర్నేషనల్ శ్రీఅన్న అండ్ ఏన్షియంట్ గ్రెయిన్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (మహర్షి) ప్రారంభించడానికి G-20 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయని కేంద్ర వ్యవసాయ మంత్రి తెలియజేశారు. ఈ సమావేశం లక్ష్యం ప్రపంచంలోని దేశాల్లో శ్రీఅన్న, ఇతర సాంప్రదాయ తృణధాన్యాల సాగు, వినియోగాన్ని పెంచడం, ఇది పోషక విలువలతో పాటు ఆహార భద్రతకు దోహదపడుతుంది. పరిశోధన, జ్ఞాన మార్పిడి, సాంకేతిక సహకారం ద్వారా శ్రీ అన్నను ప్రోత్సహించడం ఈ సమావేశం లక్ష్యం. సభ్య దేశాలు కూడా ‘దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలపై అంగీకరించాయని ఆయన చెప్పారు. ఈ సూత్రాలు స్థిరమైన, సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో మైలురాళ్లుగా పనిచేస్తాయి. భారతదేశం వ్యవసాయంలో ఉజ్వల భవిష్యత్తును సృష్టించడంపై దృష్టి పెట్టింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఆవిష్కరణ, సాంకేతికత బదిలీపై కూడా సమావేశంలో ఉద్ఘాటించారు. ఈ రంగంలో భారతదేశం చాలా కృషి చేసింది.

Also Read: Income Tax Filing: ఫారమ్-16 లేకుండా కూడా ఐటీఆర్ ఫైలింగ్ ఫైల్ చేయవచ్చు.. ఎలానో తెలుసుకోండి?

సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను భారతదేశం అర్థం చేసుకుంటుందని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతులకు మేలు చేసే విధానాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన భూగోళాన్ని అందజేయడం మన బాధ్యత కాబట్టి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారతదేశం కూడా కలిసి పనిచేయాలని కోరుతోందన్నారు. వ్యవసాయం, ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సాధనాలు, పరిజ్ఞానాన్ని రైతులకు అందజేస్తున్నామన్నారు.

 

Exit mobile version