PM Narendra Modi: కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ద్వారా దేశంలో తొలిసారిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే విద్యా వ్యవస్థను రూపొందించడం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన శ్రీ స్వామినారాయణ గురుకుల 75వ ‘అమృత్ మహోత్సవ్’లో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగాయని చెప్పారు.
Bank Robbery: ఎక్కడి నుంచి వస్తాయిరా మీకు ఐడియాలు.. సొరంగం తవ్వి బ్యాంక్ లో చోరీ
భారత్ ఉజ్వల భవిష్యత్ కోసం నూతన విద్యా విధానం, ఇన్‌స్టిట్యూట్‌లు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయన్నారు. ఈ అమృత కాలంలో విద్యా మౌలిక సదుపాయాలపై, విద్యా విధానంపై తాము దృష్టి సారించామన్నారు. దేశంలో నేడు ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి పెద్ద విద్యాసంస్థల సంఖ్య పెరుగుతోందని ప్రధాని వెల్లడించారు. 2014 తర్వాత వైద్య కళాశాలల సంఖ్య 65 శాతానికి పైగా పెరిగిందన్నారు. దేశంలో మొదటి సారిగా విద్యావిధానం భవిష్యత్ విద్యా వ్యవస్థను రూపొందిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.