NTV Telugu Site icon

Avinash Reddy : అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Ts High Court

Ts High Court

వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణ రేపటి ( మంగళవారం)కి వాయిదా పడింది. అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం ఉదయం మరోసారి విచారణ జరుగనుంది. మధ్యాహ్నం లోపు అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ నూ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినాశ్ రెడ్డిని మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అలాగే సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఉదయం పిటిషన్ పై విచారణ చేపడుతామని వెల్లడించింది. హైకోర్టులో అవినాష్ రెడ్డి, సీబీఐ తరపు లాయర్లు వాడీవేడి వాదనలు వినిపించారు.

Read Also : Virat Kohli: గంగూలీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏం చేశాడో తెలుసా?

భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అవినాశ్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్ పెండింగ్ లో ఉండగా అరెస్ట్ చేశారని తెలిపారు. పిటిషన్ విచారణ మాత్రమే జరుగుతుంది కదా అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వలేదు కదా అని న్యాయమూర్తి చెప్పారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కాంఫెషన్స్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్లు, చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ పేర్కొన్నాడు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని అన్నారు. అవినాశ్ రెడ్డి సహా నిందితుడు అంటూ ప్రచారం జరుగుతుందన్నారు. దస్తగిరికి బెయిల్ వచ్చిన తరువత రోజే సీబీఐ 306 పిటిషన్ వేశారని.. ఆయన్ని అప్రూవర్ గా మార్చారని పేర్కొన్నారు.

Read Also : Shyam Rangeela: మోడీ గెటప్‌లో హాస్యనటుడు.. నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు

హత్యకు సంబంధించిన ఆధారాలు లేవన్నారు. హత్య తరువాత సాక్షాలు తుడిచివేశారని చెప్పుతున్నారని సీబీఐ తెలిపింది. సాక్షాలు రూపుమాపడం ఆరోపణలు అయితే ఆయన్ను అరెస్ట్ చేయాల్నిన అవసరం లేదన్నారు. ఎందుకంటే దానికి 7 ఏళ్ల జైలు శిక్షకంటే ఎక్కవు లేదని క్లారిటీ ఇచ్చారు. అవినాశ్ రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాని సీబీఐ తరపు లాయర్ వాదనలు వినిపించాడు. మూడోసారి విచారణకు రమ్మనప్పుడు 5 రోజుల సమయం తీసుకుని హాజరయ్యాడని పేర్కొన్నాడు. ఇప్పుడు నోటీస్ ఇస్తే మళ్లీ పిటిషన్ వేశారని తెలిపాడు. తమ వైపు దర్యాప్తు పూర్తి చేయడానికే నోటీసులు ఇచ్చామని సీబీఐ తరపు లాయర్ తేల్చి చెప్పారు. అవినాశ్ రెడ్డి పోలీసులకు మూడు-నాలుగు సార్లు ఫోన్ చేసి కేవలం 4-5 మంది కానిస్టేబుల్స్ ను పంపిస్తే సరిపోతుందని చెప్పారని తెలిపారు. హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని పోలీసులకు ఫోన్ చేసింది అవినాశ్ రెడ్డి అని లాయర్ వెల్లడించారు. మర్డర్ ను కప్పిపుచ్చుకునేందుకు సహజ మరణం కింత చిత్రీకరించారని సీబీఐ తరపు లాయర్ అన్నాడు. ఎవిడెన్స్ తారుమూరు చేయడంలో అవినాశ్ రెడ్డి ది కీలక పాత్ర అంటూ సీబీఐ తరపున లాయన్ వాదనలు కోర్టు ముందు వినిపించారు.

Show comments