NTV Telugu Site icon

Dead Body : దీనమ్మ జీవితం.. శవాలను ముక్కలుగా కోసి అమ్మేస్తున్నారు జర జాగ్రత్త

Dead Body

Dead Body

Dead Body : కూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ ప్రస్తుతం కూటి కోసం కాకుండా కోట్ల కోసం జనం పరిగెత్తున్నారు. తానూ మనిషినే అన్న సంగతే మర్చిపోతున్నాడు. మానవత్వాన్ని వదిలి మనీ మాయలో పడిపోతున్నాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదనకు ఎంతటి నీచమైన పనులను అయినా చేసేందుకు వెనకాడడం లేదు. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నా.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నాడు. అలాంటి దారిలోనే ఓ మహిళ నడుస్తోంది. ఇలానే డబ్బు సంపాదించుకోవడానికి కొత్త బిజినెస్ ఎంచుకుంది. అదే చనిపోయిన వారి మృతదేహాలను అమ్మడం.

Read Also: Crocodiles attack: చేపలు పట్టేందుకు వెళ్తే.. వ్యక్తిని చంపి తిన్న మొసళ్లు..

సాధారణంగా శవాలను హాస్పిటల్ లోని మార్చరీలో ఉంచుతారు. అలా భద్రపరిచిన మృతదేహాలతో ఓ మహిళ బిజినెస్ చేసేది. చనిపోయిన వారి శరీరంలోని భాగాలను కట్ చేసి అమ్మేది. ఆమె ఎంతో కాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారం చేస్తుంది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. తాజాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలోని అర్కాన్సాస్ కు చెందిన కాండేస్ స్కాట్(36) ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రి మార్చరీలో పనిచేస్తోంది. కాగా ఆమె 2021లో ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో ఆమె రహస్యంగా ఓ ఒప్పందం చేసుకుంది.

Read Also: Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా

మార్చరీలో పడి ఉన్న శవాలను శరీర భాగాలను కట్ చేసి అమ్మేయడం ఆమె చేయాల్సిన పని. ఒప్పందం ప్రకారం మెడికల్ కాలేజీ నుంచి శవాల పుర్రెలు, దంతాలు, మెదడు వంటి అవయవాలను దాదాపు 11వేల డాలర్లకు ఆమె అతనికి అమ్మింది. ఒక్కసారిగా అంత డబ్బు రావడంతో ఆమె ఆనందం తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి సుమారు తొమ్మిది నెలల పాటు ఆమె మూత్ర పిండాలు, గుండె, ఊపిరితిత్తులు.. ఇలా చాలా శరీర భాగాలను అమ్మడం ప్రారంభించింది. చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమెను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.