Lakshya Sen: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 3 కాంస్య పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్ తొలి పతకం సాధించింది. దీని తర్వాత, ఆమె సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. అలాగే స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. ఇప్పుడు లక్ష్య సేన్ కూడా ఒలింపిక్ పతకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
Indian Organ Donation Day : అవయవ దానం గురించి అపోహలు.. నిపుణులు ఏమన్నారంటే ?
పారిస్ ఒలింపిక్స్ 2024లో చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నివాసి. ఆగస్ట్ 2001లో బెంగాలీ కుటుంబంలో జన్మించిన లక్ష్య సేన్ చిన్నపాటి నుండే బ్యాడ్మింటన్‌ను మొదలు పెట్టాడు. అతని తాత చంద్ర లాల్ సేన్ అల్మోరాలో బ్యాడ్మింటన్ ఆటను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి. ఇక అతని తండ్రి డి.కె. సేన్ అతని కోచ్. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది కాకుండా, 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో లక్ష్య సేన్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశపు అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకరిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. లక్ష్యసేన్ 19-21, 21-15, 21-12తో చైనీస్ తైపీ ఆటగాడు చౌ టియెన్ చెన్ ను ఓడించి ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ కు చేరుకున్న తొలి భారతీయ పురుష షట్లర్‌గా నిలిచాడు.
Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?
ఇప్పుడు సెమీ ఫైనల్లో అతను సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూ, డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్సెన్ మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడతాడు. ఇక క్వాటర్ ఫైనల్ లో తొలి గేమ్ ఓడిన లక్ష్యసేన్ రెండో గేమ్‌లో తనమేటి ఆట ఆడాడు. దీని తర్వాత నిర్ణయాత్మక గేమ్‌ను భారీ తేడాతో గెలిచి భారత షట్లర్ సెమీఫైనల్ టిక్కెట్ ను ఖాయం చేసుకున్నాడు.