NTV Telugu Site icon

Sri Lanka vs New Zealand: నేటి నుంచే రెండో టెస్ట్.. కీలక పేసర్ లేకుండానే శ్రీలంక..

Sri Lanka Vs New Zealand

Sri Lanka Vs New Zealand

Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ టీమ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 26న జరగనుంది. గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా 211 పరుగులకే కుప్పకూలింది. దాంతో మొదటి టెస్ట్ ను శ్రీలంక విజయకేతనం ఎగురవేసింది. ఇక శ్రీలంక దృష్టి ఇప్పుడు రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడంపైనే ఉంది. ఈ రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌ కూడా ఉత్కంఠభరితంగా సాగనుంది.

Black Magic: క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

రెండవ టెస్ట్ ఈరోజు (సెప్టెంబర్ 26) న గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా, రెండో టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక నేడు మొదలు కానున్న టెస్టుకు రెండు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు, ఫాస్ట్ బౌలర్ విశ్వ ఫెర్నాండో గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ఆఫ్ స్పిన్నర్ నిషాన్ పీరీస్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) మంగళవారం ప్రకటించింది.

PM KISAN: రైతులకు శుభవార్త.. ఆరోజే పిఎం కిసాన్ 18వ విడత డబ్బులు అకౌంట్లలోకి..

న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(సి), అజాజ్ పటేల్, విలియం ఓ రూర్క్.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ్ డి సిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (w), మిలన్ ప్రియనాథ్ రత్నాయకే, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, అసిత ఫెర్నాండో.