Site icon NTV Telugu

Sunil Gavaskar – Rishabh Pant: స్టుపిడ్ టూ సూపర్బ్.. సునీల్ గవాస్కర్, పంత్ మధ్య మాములుగా లేదుగా..!

Sunil Gavaskar Rishabh Pant

Sunil Gavaskar Rishabh Pant

Sunil Gavaskar – Rishabh Pant:ఇంగ్లాండ్ టూర్ వెళ్లిన టీం ఇండియా మొదటి టెస్ట్ లోనే రికార్డుల మోత మోగిస్తోంది. ఒకే టెస్టులో ఐదు సెంచరీలు రావడంతో 93 ఏళ్ల చరిత్రను తిరగరాసింది టీమిండియా. ఇది ఇలా ఉండగా.. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లలో శతకాలతో చెలరేగిన పంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో శతకాలు చేసిన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ అరుదైన రికార్డును సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్ 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో టీమిండియా తరఫున ఒక టెస్టులో రెండు సెంచరీలు సాధించిన ఏడవ బ్యాటర్ గా నిలిచాడు. అయితే, ఇంగ్లాండ్ లో ఈ ఫీట్ అందుకున్న మొదటి ఆటగాడు పంత్ కావడం విశేషం.

Read Also:Shubhanshu Shukla: రేపు రోదసిలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

మొదటి ఇన్నింగ్స్ లో శతకం సాధించిన తర్వాత తనదైన స్టైల్ లో సంబరాలు చేసుకున్న రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అందుకు విరుద్ధంగా సాదాసీదాగా వ్యవహరించాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ శతకం సాధించిన తర్వాత గ్రౌండ్ లోని స్టాండ్స్ లో ఉన్న టీమిండియా మాజీ ప్లేయర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రిషబ్ పంత్ ను తనదైన స్టైల్ లో స్టంట్ చేయమని సంకేతాల ద్వారా కోరాడు. అయితే, రిషబ్ పంత్ మాత్రం ఈసారి ఆ పని చేయకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

Read Also:TNPL 2025: బౌలింగే కాదు.. బ్యాటింగ్ లోనూ తగ్గేదేలే.. అద్భుతం చేసిన వరుణ్‌ చక్రవర్తి

గత ఆస్ట్రేలియా సిరీస్ లో అనవసర తప్పిదం చేసి అవుట్ అయిన పంత్ ను ఉద్దేశించి కామెంట్రీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో పంత్ సెంచరీ చేయగానే సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్.. అంటూ కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇకపోతే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ ఏమీ కోల్పోకుండా 21 పరుగులతో నిలిచింది. చివరి రోజు ఇరుజట్లు విజయం కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. టీమిండియా మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండు పాథ్య్ వికెట్లను నెలకొల్చాలి. అదే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలవాలంటే 350 పరుగులు చేయాలి.

Exit mobile version