NTV Telugu Site icon

Police Patrol Bike: ఇది విన్నారా.. స్టేషన్ బయట ఉన్న పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ..

Police

Police

Police Patrol Bike: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పోలీస్ పోస్ట్ వద్ద పార్క్ చేసిన పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ను దొంగలు అపహరించారు. అక్టోబరు 15న పట్టపగలు ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అయితే, ఈ విషయం మీడియాలో వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ కేసులో గుర్తు తెలియని దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు

ఈ కేసు జబల్‌పూర్‌లోని సంజీవని పోలీస్ స్టేషన్ పరిధిలోని ధన్వంతరి నగర్ పోలీస్ పోస్టుకు సంబంధించినది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 15 మధ్యాహ్నం పోలీసు బృందాలు సాధారణ పెట్రోలింగ్‌లో తిరుగుతున్నాయి. ఇంతలో పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ఔట్‌పోస్టు వద్దకు చేరుకోవడంతో దానిపై ఎక్కిన పోలీసు సిబ్బంది ఔట్‌పోస్టు లోపలికి వెళ్లారు. కొంతసేపటి తర్వాత ఈ పోలీసులు బయటకు వచ్చేసరికి ‘చిరుత’ కనిపించలేదు. ఈ ఘటన మొత్తం పోలీసు పోస్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ దొంగ పోలీసులకు దొరకకపోవడంతో తలలు పట్టుకున్నారు దొంగలు.

Read Also: Karnataka: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో దిక్కుతోచని స్థితిలో రైతులు

Show comments