NTV Telugu Site icon

Corporater: అంచెలంచెలుగా ఎదిగాడు.. ఆఖరికి కుక్క చావు చచ్చాడు

Sand

Sand

Corporater: అతనొక పంచాయతీ కార్పొరేటర్ చిన్న తనంలోనే అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. తన ఎదుగుదల ఓర్వలేని కొందరు దారుణంగా హత్య చేశారు. పోలీసులకు కనీసం క్లూస్ కూడా చిక్కకుండా ప్లాన్ చేసి లేపేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. బభుల్‌గావ్ నగర్ పంచాయతీ కార్పొరేటర్ అనికేత్ గవాండే పదునైన ఆయుధంతో పొడిచి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఇసుక డబ్బుల వివాదం కారణంగానే హత్య జరిగినట్లు సమాచారం. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనికేత్ హత్య బాబుల్‌గావ్‌లో కలకలం సృష్టించింది.

Read Also: Gold Smuggling : బంగారం బీరు బాటిళ్లలో పెట్టావు బాగానే ఉంది.. కానీ

అనికేత్‌ చిన్నతనంలోనే బబుల్‌గావ్ తాలూకాలో ఇసుక వ్యాపారంలోకి అడుగు పెట్టి బాగా సంపాదించాడు. ఆ తర్వాత ప్రహార్ నుంచి నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. బబుల్‌గావ్ తాలూకాలోని నదిలో ఇసుక వ్యాపారం బాగా సాగుతోంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తున్నాయి. దాని నుండి డబ్బులు భారీగా సంపాదించొచ్చని యువత ఆ వ్యాపారాన్నే ఎంచుకుంటుంది. కానీ, పోటీ చాలా ఏర్పడింది. అనికేత్ విషయంలో ఈ వ్యాపారంలో తలెత్తిన వివాదాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అనికేత్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.

Read Also: PAK : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పాక్ లో ప్రాయాణికుడు మృతి

Show comments