NTV Telugu Site icon

Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గుడ్ న్యూస్..

Emmanuel Macron

Emmanuel Macron

భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయ విద్యార్థులకు ఎక్కువ మంది ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ ను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ఇమాన్యుయేల్ మెక్రాన్ పేర్కొన్నారు.

Read Also: Narendra Modi : 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కల నెరవేరుతుందా ?

అంతే కాకుండా భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ అందించే తోడ్పాటు గురించి కూడా అధ్యక్షుడు ఇమాన్యయేల్ మెక్రాన్ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా అంతర్జాతీయ తరగతులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్‌వర్క్‌ను సృష్టిస్తాం అని చెప్పుకొచ్చారు. ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని మెక్రాన్ తెలిపారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న (గురువారం) మెక్రాన్‌ ప్రత్యేక విమానంలో జైపుర్‌ నగరానికి వెళ్లారు.. ఇక, అక్కడి నుంచి ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.