NTV Telugu Site icon

French Airlines: సిబ్బంది మెరుపు సమ్మె.. 70 శాతం విమాన సర్వీసులు రద్దు

Air

Air

సామూహిక సమ్మె కారణంగా పారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ ఎయిర్‌లైన్స్ 70 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. రెండు నెలల్లో.. అనగా జూలై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయం ఫ్రాన్స్‌లోని రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో రాకపోకలు బంద్ అయ్యాయి. మెరుపు సమ్మెతో సర్వీసులు రద్దయ్యాయి.

ఇది కూడా చదవండి: Hema – Vishnu: డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన హేమకు మంచు విష్ణు మద్దతు!!

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె కారణంగా పారిస్ ఓర్లీ విమానాశ్రయంలో శని, ఆదివారాల్లో 70 శాతం విమానాలను రద్దు చేయాలని ఫ్రెంచ్ పౌర విమానయాన అథారిటీ విమానయాన సంస్థలను ఆదేశించింది. రెండ్రోజుల రద్దు కారణంగా వాణిజ్య విమానాలపై ప్రభావం చూపుతాయని DGAC అథారిటీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Gangs of Godavari: ఆడ, మగ, పొలిటీషియన్స్.. రచ్చ రేపేలా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైలర్

విమాన సిబ్బంది ఇలా హఠాత్తుగా సమ్మెకు దిగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. మే ప్రారంభంలో సమ్మె కారణంగా యూరప్‌ దేశాలకు పెద్దసంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాశ్రయ అధికారులు, అక్కడి ప్రధాన లేబర్‌ యూనియన్‌ ఎస్‌ఎన్‌సీటీఏ మధ్య చర్చలు సఫలమవడంతో అప్పటి వివాదం ముగిసింది. తాజాగా రెండో అతిపెద్ద లేబర్‌ గ్రూప్‌ యూఎన్‌ఎస్‌ఏ- ఐసీఎన్‌ఏ సమ్మెకు పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి: Mayawati: ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికారంలో ఉండరు.. బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు