Gangs of Godavari: ఆడ, మగ, పొలిటీషియన్స్.. రచ్చ రేపేలా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangs of Godavari Trailer Released: మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మే 25 తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్‌లో జరిగింది. “లంకల రత్న” అనే శక్తివంతమైన పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తున్నారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అమోఘం. తనదైన ఆహార్యం, అభినయంతో పాత్రకు నిండుదనం తీసుకొచ్చారు. “లంకల రత్న” పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు.
Haryana: ఎన్నికల వేళ విషాదం.. గుండెపోటుతో యువ ఎమ్మెల్యే మృతి
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆ పాత్ర ప్రయాణం ఎలా ఉండబోతుందో చూపించిన తీరు.. సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనుషులను మూడు వర్గాలుగా వివరించే పాత్రతో ట్రైలర్ ప్రారంభమైతే, కథానాయకుడు వారిని “మగ”, “ఆడ” మరియు “రాజకీయ నాయకులు”గా వర్గీకరించడంతో ముగుస్తుంది. అలాగే, లంకల రత్న పలికే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేహా శెట్టి ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తున్నారు. అంజలి పాత్ర కూడా ఆకట్టుకుంటోంది. ఆమె పాత్రకు లంకాల రత్నతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!