NTV Telugu Site icon

Tomatoes For Flight Bookings: ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!

Tomatoes Ticket

Tomatoes Ticket

Free Tomatoes For Flight Bookings in Madurai: ప్రస్తుతం భారతదేశం అంతటా ‘టమాటాలు’ పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఎవరిని కదిలించినా టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం టమాటాల ధర ఎక్కసారిగా పెరగడమే. కిలో టమాటాల ధర కొన్ని రాష్ట్రాల్లో రూ. 200 ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ. 150కి పైగా ఉంది. దాంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల దృష్ట్యా టమాటాలు కూడా విలాస వస్తువుల జాబితాలో చేరిపోయాయి. టమాటాలకు ఉన్న ఈ డిమాండ్‌ను పలు సంస్థలు సొమ్ముచేసుకోవాలి చూస్తున్నాయి.

దేశంలోని పలు వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘టమాటా’ ఆఫర్‌ ప్రకటిస్తున్నాయి. తాజాగా మధురైలోని ఓ దేశీయ విమాన సంస్థ ఫ్లైట్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ అంటూ ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ప్రకటించింది. మదురైలో దేశీయ విమాన టిక్కెట్‌ బుకింగ్‌కు 1 కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్‌కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ప్రకటింంది.

ఈ కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ట్రావెల్‌ ఏజెన్సీ ప్రకటించడం గమనార్హం. తమ వ్యాపారానికి టమాటాలు బాగా సహాయపడ్డాయని సదరు ఏజెన్సీ యాజమన్యం సంతోషం వ్యక్తం చేసింది. జూలై 11, 12 తేదీల్లో ఈ ఆఫర్‌ చాలా మంది కస్టమర్‌లను ఆకర్షించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఉందో లేదో తెలియరాలేదు. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. టమాటా ధరలను పలు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.

Also Read: Homemade Pimples Face Packs: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేస్తే అందమైన ముఖం మీ సొంతం!

Also Read: Monsoon Health Tips: వేడి నీటిలో వీటిని కలుపుకుని తాగితే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది!

 

Show comments