Free Rides For Drinkers: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు టీజీపీడబ్ల్యూయూ (Telangana Gig and Platform Workers Union) ఆధ్వర్యంలో ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (TGFWDA)తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఉచిత క్యాబ్, బైక్ రైడ్స్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
Hit And Run: మాదాపూర్‌లో హిట్ అండ్ రన్.. ట్రాఫిక్ హోమ్ గార్డ్‌ను ఢీకొట్టి పరారీ అయిన కారు డ్రైవర్
ఇవాళ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ సేవలు కొనసాగనున్నాయి. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరగకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2025 ఏడాది వేడుకలలో కూడా ఈ కార్యక్రమం కింద మొత్తం 789 ఉచిత క్యాబ్, బైక్ రైడ్స్ అందించినట్లు టీజీపీడబ్ల్యూయూ వెల్లడించింది. మద్యం సేవించిన వారు బాధ్యతగా వ్యవహరించి ఈ ఉచిత రవాణా సేవలను వినియోగించుకోవాలని, సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్‌స్వీప్..!
