NTV Telugu Site icon

APSRTC Chairman: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్‌న్యూస్‌!

Apsrtc

Apsrtc

APSRTC Chairman: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్​ కొనకళ్ల నారాయణ గుడ్‌ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు పరుస్తోందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలును వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

Read Also: Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్ విచారణ పూర్తి

తాజాగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్ ప్రయాణం అమలు తీరుని పరిశీలించనుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆర్టీసీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వుండాలి అంటే కావాల్సిన అంశాలపై పరిశీలించి ప్రతిపాదనలు పంపారు. రద్దీ విపరీతంగా పెరుగనున్న దృష్ట్యా ఆర్టీసీలో మరో 2వేల బస్సులతో పాటు సిబ్బంది కావాలని ప్రభుత్వం ఆర్టీసీని కోరిందని పేర్కొన్నారు. ఈ నియామకాలు అన్ని పూర్తి చేసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్​ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు.

Show comments