Site icon NTV Telugu

Indrakeeladri : భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఇంద్రకీలాద్రిపై ఉచిత బస్సు సర్వీసులు.

Indrakeeladri

Indrakeeladri

భక్తులకు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఆలయ ట్రాన్స్‌పోర్ట్‌ డీఈని ఈవో ఆదేశించారు. భక్తులకు ఉచిత సేవలు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో చెబుతున్నారు. అయితే నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు దుర్గ ఘాట్‌ నుంచి బస్సులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈవో నిర్ణయం కక్ష సాధింపు అని టెంపుల్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరడం, ఆపై కోర్టుకు వెళ్లడంతోనే ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. దుర్గగుడి ఈవో నిర్ణయంపై దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌కు ఫిర్యాదు చేసే యోచనలో టెంపుల్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులు ఉన్నారు.

Also Read : Khakistan Protests: కెనడాలో ఖలిస్తానీల ఆందోళనలు.. ధీటుగా స్పందించిన భారతీయులు

ఇదిలా ఉంటే.. నిన్న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం తరఫున శనివారం సారె సమర్పించారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.ల వన్న, ట్రస్ట్‌బోర్డు సభ్యులు సారెను సమర్పించారు. ఆలయంలో వారికి ఈవో భ్రమ రాంబ సాదర స్వాగతం పలికారు. మహామండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్పవమూర్తి ఎదుట పూజలు నిర్వహించారు. దుర్గగుడి ఇంజనీరింగ్‌ విభాగం దుర్గ మ్మకు సారె సమర్పించింది. ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బందితో కలిసి ఈవో భ్రమరాంబ తొలుత జమ్మిడొడ్డిలో దేవతల విగ్రహాల వద్ద పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఇంజనీరింగ్‌ సిబ్బంది జమ్మిదొడ్డి నుంచి సారె తీసుకుని కొండపైకి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. డిప్యూటీ ఈవో గురుప్రసాద్‌, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, డీఈలు, ఏఈలు, స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Also Read : Urad Dal: ఉవ్వెత్తిన ఎగిసిన టమాటా ధర.. అదే దారిలో కందిపప్పు

Exit mobile version