దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లుగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడితే.. ఆ సొమ్ముతో పరారయ్యాడు ఓ ఘనుడు. లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలతో పారిపోయాడు. శంషాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు పల్లెమోని సురేందర్. చిట్టీల పేరుతో జనాలకు కుచ్చు టోపీ పెట్టాడు. రూ. 5 కోట్లకు పైగా జనాలకు కుచ్చుటోపి పెట్టి రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా పారిపోయాడు పల్లెమోని సురేందర్. విషయం తెలుసుకున్న బాధితులు శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read:Prabhas : ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్‌డేట్..!
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సురేందర్ దంపతుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తమ డబ్బులతో పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. కాగా చీట్టీలు వేసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దని తెలిపారు.
