Site icon NTV Telugu

Fraud At Registrar Office: అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు

Bribe

Bribe

అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు మారుతున్నాయి. ఏసీబీ దాడులు చేస్తున్న వదలని అవినీతి కంపు వదలడం లేదు. విజయవాడలోని పటమట, గాంధీనగర్, మాచవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కాసుల వర్షం కురుస్తోంది. పటమట రిజిస్ట్రార్ పోస్ట్ కోసం కోటి నుంచి కోటిన్నర వరకు బేరాలు సాగుతున్నట్లు సమాచారం. ఆడిట్ ఆఫీస్ లో రిజిస్ట్రార్, డిప్యూటేషన్ విధుల్లో ఉన్న మరో రిజిస్ట్రార్ పోటా పోటీ లాబీయింగ్ చేస్తున్నారని, రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసూళ్ళ కోసం మళ్లీ ప్రైవేట్ సిబ్బంది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Ruhani Sharma : తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా ఉన్న చి.ల.సౌ భామ

ఇటీవల డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని ఏసీబీ అరెస్ట్ చేసినా రిజిస్ట్రార్ల తీరు మారడం లేదు. ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ఆఫీసులో అర్థరాత్రి వరకు రిజిస్ట్రార్, సిబ్బంది ఉండటంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆదాయానికి మించి కోట్లలో ఆస్తులు రిజిస్ట్రార్లు కూడగడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీ తనిఖీలు కేవలం లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న కేసులే నమోదు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెజవాడలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల మధ్య కోల్డ్ వార్ తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో రచ్చకెక్కుతున్నారట. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ రాఘవ రావు అరెస్ట్ రిమాండ్ రిపోర్టు లో దిమ్మదిరిగే విషయాలు నమోదు చేసింది ఏసీబీ. రిజిస్ట్రార్లు అందరూ డబ్బులు వసూలు చేసి ఉన్నతాధికారికి ఇస్తున్నట్టు చెప్పినట్టు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ ఉండటం గమనార్హం.

Radha Krishna: ఎట్టకేలకు స్టార్ హీరోని పట్టేసిన ‘రాధే శ్యామ్’ డైరెక్టర్…

Exit mobile version