NTV Telugu Site icon

France: ఇది తెలిస్తే మందుబాబుల గుండె పగిలిపోతుంది.. ఆల్కహాల్ ను కొని నాశనం చేస్తున్న ప్రభుత్వం

Wine

Wine

France Government Destroying Excess Wine: ఈ వార్త తెలుసుకుంటే మందు బాబుల గుండె పగిలిపోవచ్చు. ఎందుకంటే మందు బాటిల్ లో చుక్క వేస్ట్ అయినా మందుబాబులు అల్లాడిపోతుంటారు. అలాంటిది ఏకంగాా కొన్ని వేల లీటర్ల వైన్ ను  కొని నాశనం చేయడానికి సిద్దపడింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఎవరైనా స్టాక్ ఎక్కువగా ఉంటే దానిని చౌకగా అమ్మేస్తారు. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం ఎక్కువ నిల్వ ఉన్న వైన్ ను నాశనం చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఏకంగా 200 మిలియన్ల యూరోలను ఖర్చు చేస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు అది రూ.1700 కోట్లకు సమానం. ఇంత ఖర్చు పెట్టి మరీ ఫ్రాన్స్ వైన్ ను నాశనం చేస్తుంది. ఫ్రాన్స్ లో ఇంత మొత్తంలో వైన్ పేరుకుపోవడానికి కారణముంది.

రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం,ద్రవ్యోల్బణం, కొవిడ్ ప్రభావం,  ఆహారం, ఇంధన ధరలు పెరిగిపోవడంతో.. ఫ్రాన్స్ ప్రజలు తమ ఖర్చులను గణనీయంగా తగ్గించుకున్నారు. ముఖ్యంగా.. వైన్‌ వంటి చెడు అలవాట్లకు డబ్బు వేస్ట్ చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎందుకంటే తాగితే కేవలం మందుకు మాత్రమే కాకుండా తరువాత ఆరోగ్యం చెడిపోయి కూడా వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు.  అందుకే ఫ్రాన్స్ ప్రజలు అల్కహాల్ వినియోగాన్ని బాగా తగ్గించేశారు. దీనికి బదులు నాన్-ఆల్కహాలిక్, క్రాఫ్టెడ్ బీర్ వంటి ఇతర రకాల లిక్విడ్ డ్రింక్స్‌ వాడుతున్నారు. దీంతో వాటికి ఆ దేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ఈ కారణంగా వైన్‌ దిగ్గజాలైన బోర్డాక్స్‌, లాంగ్యూడాక్‌ సంస్థల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. వాటి వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. భారీగా నష్టపోయిన ఆ సంస్థలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆ వైన్ ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. అయితే వాటిని కొన్న  ప్రభుత్వం వాటిని తక్కువ ధరకు విక్రయిస్తుంది అనుకుంటే వైన్ డిమాండ్ ను పెంచడం కోసం కొన్ని మొత్తానికి నాశనం చేయాలని డిసైడయ్యింది. దాదాపు రూ.1700 కోట్లు పెట్టి కొన్ని వైన్ ను ఇలా చేస్తుంటే మందు బాబులు అల్లాడిపోతున్నారు. ఎందుకు సామి వేస్ట్ చేయడం మాకు ఇవ్వచ్చు కదా అని అనకుంటున్నారు. ఒక విధంగా ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు.

 

 

 

Show comments