Site icon NTV Telugu

France air show video: ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కూలిన జెట్ విమానం

Franceairshowvideo

Franceairshowvideo

ఫ్రాన్స్‌లో జరిగిన ఎయిర్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. 65 ఏళ్ల పైలట్‌ విమానంతో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్‌ జెట్‌ విమానం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తయారైంది. ఈ విమానాన్ని ఫ్రాన్స్‌ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది.

విమానంలో ఎజెక్షన్‌ సీటు లేకపోవడమే పైలట్‌ మృతికి కారణమని చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version