Foxtail Millet Kulfi: బాబోయ్ ట్రెండింగ్‌లో కొర్రల కుల్ఫీ.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foxtail Millet Kulfi: ఐస్‌క్రీమ్‌లకు బదులుగా ఆరోగ్యకరమైన, పోషకాలు పుష్కలంగా ఉన్న డెజర్ట్ కావాలనుకుంటే కొర్రల కుల్ఫీ ఒక మంచి ఎంపిక అని చెప్పాలి.. కొర్రలు (Foxtail Millet) జీర్ణక్రియకు చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఇంట్లోనే సులభంగా ఈ కొర్రల కుల్ఫీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి..
Read Also: Motorolaలో సరికొత్త స్మార్ట్ఫోన్లు.. ఫోల్డబుల్.. లాంచ్‌కు రెడీ..
Also Read
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
- Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
కావలసిన పదార్థాలు
* కొర్రలు (ఉడికించినవి)- ½ కప్పు
* పాలు (ఫుల్ ఫ్యాట్ మిల్క్)- ½ లీటరు
* పంచదార లేదా బెల్లం- రుచికి తగినంత
* యాలకుల పొడి- ½ స్పూన్
* కండెన్స్డ్ మిల్క్- (మరింత క్రీమీ టెక్స్చర్ కోసం)
* గార్నిష్ కోసం పిస్తా, బాదం ముక్కలు
Read Also: UP: ఉసురు తీసిన ‘ఆన్లైన్ గేమింగ్’.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
తయారు చేసే విధానం:
* కొర్రలను శుభ్రంగా కడిగి, మెత్తగా ఉడకబెట్టాలి.. చల్లారిన తర్వాత అవసరమైతే కొద్దిగా పాలు కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవడం బెటర్..
* ఒక గిన్నెలో పాలు పోసి, స్లోగా మరగబెట్టాలి.. పాలు సగానికి తగ్గే వరకు ఉడికించటం వలన కుల్ఫీ మరింత క్రీమీగా రెడీ అవుతుంది.
*మిశ్రమం కలపడం: బాగా మరిగిన పాలలో కొర్రల పేస్ట్, పంచదార లేదా బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి.. తక్కువ మంటపై 5 నుంచి10 నిమిషాలు ఉడికిస్తూ మిశ్రమం చిక్కబడే వరకు ఉంచాలి. కావాలంటే ఈ దశలో కండెన్స్డ్ మిల్క్ ను యాడ్ చేయొచ్చు.
* గ్యాస్ పై ఉంచిన మిశ్రమం బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చాలి.. అనంతరం చల్లారిన మిశ్రమాన్ని కుల్ఫీ అచ్చులలో లేదా స్టీల్ గ్లాసుల్లో పోసుకోవాలి.. దానిపైనా పిస్తా, బాదం ముక్కలను చల్లుకోవాలి..
* ఫాయిల్ పేపర్‌తో మూసి, ఐస్‌క్రీమ్ స్టిక్ గుచ్చి కనీసం 6- 8 గంటల పాటు లేదంటే రాత్రంతా ఫ్రీజర్‌లో పెట్టాలి.. ఇక, ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత అచ్చులను ఒక నిమిషం నీళ్లలో ముంచి, కుల్ఫీని నెమ్మదిగా బయటకు తీసి చల్లగా సర్వ్ చేసేయాలి..
చిట్కాలు:
* అయితే, పాలను నెమ్మదిగా మరిగిస్తే కుల్ఫీ మరింత క్రీమీగా రెడీ అవుతుంది.
* పంచదార ఎక్కువగా వేస్తే కుల్ఫీ జిగటగా మారే అవకాశం ఉంటుంది, కాబట్టి లిమిటేడ్ గా ఉపయోగించాలి.
* ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు చక్కెర బదులు బెల్లం వాడితే చాలా బెటర్.. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసిన కొర్రల కుల్ఫీ ఆరోగ్యకరం మాత్రమే కాదు.. చాలా టెస్టీగా కూడా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ డెజర్ట్‌ను ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి!.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!