Site icon NTV Telugu

Foxtail Millet Kulfi: బాబోయ్ ట్రెండింగ్లో కొర్రల కుల్ఫీ.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Kulfy

Kulfy

Foxtail Millet Kulfi: ఐస్‌క్రీమ్‌లకు బదులుగా ఆరోగ్యకరమైన, పోషకాలు పుష్కలంగా ఉన్న డెజర్ట్ కావాలనుకుంటే కొర్రల కుల్ఫీ ఒక మంచి ఎంపిక అని చెప్పాలి.. కొర్రలు (Foxtail Millet) జీర్ణక్రియకు చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఇంట్లోనే సులభంగా ఈ కొర్రల కుల్ఫీని ఎలా తయారుచేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి..

Read Also: Motorolaలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫోల్డబుల్.. లాంచ్‌కు రెడీ..

కావలసిన పదార్థాలు
* కొర్రలు (ఉడికించినవి)- ½ కప్పు
* పాలు (ఫుల్ ఫ్యాట్ మిల్క్)- ½ లీటరు
* పంచదార లేదా బెల్లం- రుచికి తగినంత
* యాలకుల పొడి- ½ స్పూన్
* కండెన్స్‌డ్ మిల్క్- (మరింత క్రీమీ టెక్స్చర్ కోసం)
* గార్నిష్ కోసం పిస్తా, బాదం ముక్కలు

Read Also: UP: ఉసురు తీసిన ‘ఆన్‌లైన్ గేమింగ్’.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

తయారు చేసే విధానం:
* కొర్రలను శుభ్రంగా కడిగి, మెత్తగా ఉడకబెట్టాలి.. చల్లారిన తర్వాత అవసరమైతే కొద్దిగా పాలు కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవడం బెటర్..
* ఒక గిన్నెలో పాలు పోసి, స్లోగా మరగబెట్టాలి.. పాలు సగానికి తగ్గే వరకు ఉడికించటం వలన కుల్ఫీ మరింత క్రీమీగా రెడీ అవుతుంది.
*మిశ్రమం కలపడం: బాగా మరిగిన పాలలో కొర్రల పేస్ట్, పంచదార లేదా బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి.. తక్కువ మంటపై 5 నుంచి10 నిమిషాలు ఉడికిస్తూ మిశ్రమం చిక్కబడే వరకు ఉంచాలి. కావాలంటే ఈ దశలో కండెన్స్‌డ్ మిల్క్ ను యాడ్ చేయొచ్చు.
* గ్యాస్ పై ఉంచిన మిశ్రమం బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చాలి.. అనంతరం చల్లారిన మిశ్రమాన్ని కుల్ఫీ అచ్చులలో లేదా స్టీల్ గ్లాసుల్లో పోసుకోవాలి.. దానిపైనా పిస్తా, బాదం ముక్కలను చల్లుకోవాలి..
* ఫాయిల్ పేపర్‌తో మూసి, ఐస్‌క్రీమ్ స్టిక్ గుచ్చి కనీసం 6- 8 గంటల పాటు లేదంటే రాత్రంతా ఫ్రీజర్‌లో పెట్టాలి.. ఇక, ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత అచ్చులను ఒక నిమిషం నీళ్లలో ముంచి, కుల్ఫీని నెమ్మదిగా బయటకు తీసి చల్లగా సర్వ్ చేసేయాలి..

చిట్కాలు:
* అయితే, పాలను నెమ్మదిగా మరిగిస్తే కుల్ఫీ మరింత క్రీమీగా రెడీ అవుతుంది.
* పంచదార ఎక్కువగా వేస్తే కుల్ఫీ జిగటగా మారే అవకాశం ఉంటుంది, కాబట్టి లిమిటేడ్ గా ఉపయోగించాలి.
* ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు చక్కెర బదులు బెల్లం వాడితే చాలా బెటర్.. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసిన కొర్రల కుల్ఫీ ఆరోగ్యకరం మాత్రమే కాదు.. చాలా టెస్టీగా కూడా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ డెజర్ట్‌ను ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి!.

Exit mobile version