NTV Telugu Site icon

Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధుల భేటీ

Foxconn

Foxconn

Nara Lokesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ సంస్థ ముందుకొచ్చింది. సోమవారం ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉ్న అవకాశాలను వివరించారు. వి లీ నేతృత్వంలోని ఫాక్స్‌కాన్‌ సీనియర్ ప్రతినిధి బృందంతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహానాలు, డిజిటల్ హెల్త్ వంటి రంగాల్లో ఫాక్స్ కాన్ ప్రణాళికలపై చర్చించారు. త్వరలోనే ఏపీలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఏపీలో ఫాక్స్‌కాన్‌ మెగా మాన్యూఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయాలని లోకేష్ వారిని కోరారు.

Read Also: Ashwini Vaishnaw: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు

ఏపీని మ్యానుఫాక్చరింగ్ హబ్ చేసేందుకు కృషి చేస్తున్నామని లోకేష్ తెలిపారు. ఏపీలో మ్యానుఫాక్చరింగ్ సిటీ రూపకల్పనలో ఫాక్స్ కాన్ సహయం తీసుకుంటామన్నారు. ఏపీ ఉత్పత్తి రంగానికున్న అవకాశాలు ఫాక్స్ కాన్ బృందానికి వివరించామని నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో ఉత్పత్తి రంగ అభివృద్ధికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ శకం ముగిసింది.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ శకం నడుస్తోందన్నారు. ఫాక్స్‌కాన్ సహా ఇతర పెద్ద గ్లోబల్ కంపెనీల కోసం ఇండస్ట్రియల్ జోన్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.