NTV Telugu Site icon

Hajj 2024: సౌదీ అరేబియాలో హీట్ స్ట్రోక్తో 14 మంది హజ్ యాత్రికులు మృతి..

Hajj

Hajj

ఈద్-ఉల్-అజా పండుగ సందర్భంగా.. సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. అయితే.. సౌదీ అరేబియాలో తీవ్రమైన ఎండలు, వేడితో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హజ్ సమయంలో 47 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. మక్కాలో విపరీతమైన వేడిమి కారణంగా ఆరుగురు మరణించారు.

Read Also: Kalavedika Ntr Film Awards: కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ చేసిన ఏపీ సీఎం..

తాజాగా.. మరో 14 మంది జోర్డానియన్లు మరణించారు. హజ్ తీర్థయాత్రలో 14 మంది జోర్డానియన్లు చనిపోయారు.. మరో 17 మంది తప్పిపోయారు. ఈ విషయాన్ని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు, అరాఫత్ పర్వతంపై హీట్ స్ట్రోక్ కారణంగా ఆరుగురు జోర్డాన్ పౌరులు మరణించినట్లు జోర్డాన్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసులు గతంలో ధృవీకరించారు.

Read Also: Tammudu Re-Release : అయ్యా బాబోయ్.. ఇదేం మాస్ సెలబ్రేషన్స్ బాబు..

సౌదీ జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. ఈ ఏడాది 1.8 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొనే అవకాశం ఉన్నందున, బుధవారంతో ముగియనున్న హజ్ ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక సమావేశాలలో ఒకటి. ఈ క్రమంలో.. తొక్కిసలాటలు, డేరా మంటలు, వేడి, ఇతర కారణాలతో గత 30 సంవత్సరాలలో వందలాది మంది మరణించారు.