Site icon NTV Telugu

Boy dies with Hot Tea: వేడి వేడి టీ తాగి బాలుడు మృతి

Boy Dies With Hot Tea

Boy Dies With Hot Tea

Boy dies with Hot Tea: తల్లి దండ్రులు చేసిన ఓ పొరపాటు నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసింది.. మంచినీరు అనుకుని పొరపాటును వేడి వేడి టీ తాగడంతో ఆస్పత్రి పాలైన బాలుడు.. చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచాడు.. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాడికిలోని చెన్నకేశవస్వామి కాలనీలో రామస్వామి, చాముండేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి నాలుగేళ్ల రుత్విక్‌, రెండేళ్ల వయస్సు ఉన్న యశస్విని అనే పిల్లలు ఉన్నారు.. అయితే, మూడు రోజుల క్రితం ఇంట్లో ఫ్లాస్క్‌లో ఉంచిన టీని మంచినీరుగా భావించి తాగాడు.. టీ వేడిగా ఉండడంతో అల్లాడిపోయిన నాలుగేళ్ల బాలుడు స్పృహతప్పి పడిపోయాడు.. దీంతో, వెంటనే చికిత్స కోసం తాడిపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు… అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.. కానీ, వైద్యులు ఆ బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు బాలుడు… ముద్దు ముద్దు మాటలతో తమ మధ్య తిరిగి బాలుడు మృతిచెందడంతో.. ఆ తల్లిదండ్రుల దుఖః ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.. రుత్విక్, యశశ్విని ఇద్దరూ వేడి టీ తాగినా.. గొంతులోపల గాయం కావడంతో రుత్విక్‌ మాత్రం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

Read Also: Afghanistan: ఆఫ్ఘాన్‌పై పాక్ వైమానిక దాడి.. అసలు తాలిబన్ల వద్ద ఫైటర్ జెట్లు, క్షిపణులు ఉన్నాయా..?

Exit mobile version