Site icon NTV Telugu

Breaking : పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి భద్రత పెంపు..

Pilot Rohit Reddy

Pilot Rohit Reddy

మొయినాబాద్‌ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి. ఈ ఆడియోల్లో ఎమ్మెల్యే బేరసారాలు గురించి.. ఎప్పుడు కలుద్దామనేదాని గురించి చర్చించారు. అయితే.. తాజాగా.. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు కేటాయిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : New Bike: ఓరి నీ ఏషాలో.. కొత్త బైక్‌ కొంటే ఇంత రచ్చ చేయాలా..?

ఇప్పటికీ 2+2 గన్‌మెన్‌లు కలిగిన రోహిత్ రెడ్డికి.. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ జారీచేసింది హోంశాఖ. అయితే.. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ పై ఈరోజు తీర్పు వెల్లడించనుంది తెలంగాణ హైకోర్టు. నిందితులను రిమాండ్ కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసుల వాదన.. పక్కా ప్లాన్ తో తెలంగాణ ఎమ్మెల్యేలకు కొనుగోలుకు ప్రయత్నించిన ఆధారాలున్నాయంటూ కోర్టు ముందు వాదనలు వినిపించారు పోలీసులు. ముందస్తు సమాచారంతో ఆపరేషన్ చేసినట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. కాసేపట్లో నిందితుల కస్టడీపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

Exit mobile version