Site icon NTV Telugu

Road Accident: ఆగి ఉన్న పాల వ్యాన్‌ను ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు మృతి

Accident

Accident

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను అంబులెన్స్‌ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబులెన్స్‌లో ఏడుగురు ఉండగా నలుగురు మృత్యువాత పడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు తెలిసింది.

Also Read: Andrapradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్ లారీ, తుఫాన్ వాహనం ఢీ.. ఐదుగురు మృతి..

ఇదిలా ఉండగా.. అన్నమయ్య జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద సిమెంట్ లారీ – తుఫాన్ వాహనం ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.. గత కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆ ప్రమాదం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 11 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు. తుఫాన్ వాహనంలోని వారంతా తిరుమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.. ఈ ఘోర ప్రమాదం ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లేనని సమాచారం. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సమయం లో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతులను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.. అందులో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ ప్రమాదం గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version