Andrapradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్ లారీ, తుఫాన్ వాహనం ఢీ.. ఐదుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద సిమెంట్ లారీ – తఫాన్ వాహనం ఢీకున్నాయి.. ఈ ప్రమాదంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.. గత కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆ ప్రమాదం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 11 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు. తుఫాన్ వాహనంలోని వారంతా తిరుమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది..
ఈ ఘోర ప్రమాదం ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లేనని సమాచారం. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సమయం లో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతులను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.. అందులో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ ప్రమాదం గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉన్నాయి..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
తాజావార్తలు
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!