NTV Telugu Site icon

Chhattisgarh: సుక్మా జిల్లాలో లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు..

Naxuls

Naxuls

Chhattisgarh: మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపు ఇచ్చారు. దీంతో నలుగురు మావోయిస్టులు గురువారం సుక్మా జిల్లాలో భద్రతా దళ సిబ్బంది ముందు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిని మిడియం భీమా, సోది మున్నా అలియాస్ మనోజ్, ముచకీ దేవ, సూల ముచకీలుగా పోలీసులు గుర్తించారు. వీరిలో మిడియం భీమా తలపై దాదాపు 2 లక్షల రూపాయల రివార్డు ఉందని చెప్పుకొచ్చారు. అతడు మావోయిస్టు పార్టీలోని ప్లాటూన్ నంబర్ 4లో క్రియాశీల సభ్యుడిగా పని చేసే వాడని పేర్కొన్నారు.

Read Also: IPL 2025-Rohit Sharma: రోహిత్ వేలంలోకి వస్తే.. ఆక్షన్ ఆసక్తికరమే!

ఇక, లొంగిపోయిన మిగతా ముగ్గురు మావోయిస్టులు.. దిగువ క్యాడర్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో అమాయక గిరిజనులపై మావోయిస్టులు దాడులు చేయడం చూసి బాధగా అనిపించిందని లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. ఇవి అమానవీయ దాడులు, మావోయిస్టు సైద్ధాంతిక భావజాలం డొల్లతనంతో కూడుకొని ఉందని ఆరోపించారు. అందుకే తాము దాన్ని వదిలేసి, పోలీసుల ముందు లొంగిపోయం అని సరెండర్ అయిన మావోయిస్టులు వెల్లడించారు.

Show comments