Site icon NTV Telugu

Gadchiroli : గడ్చిరోలిలో నలుగురు మావోయిస్టులు హతం..

Gadchiroli

Gadchiroli

Gadchiroli : మహారాష్ట్రలోని గడ్చిరోలి-నారాయణ్‌పూర్ సరిహద్దులోని కోపర్షి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 19 C60 యూనిట్లు CRPF QAT 02 యూనిట్ల ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 8 గంటల పాలు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఒక పురుషుడు, ముగ్గురు స్త్రీలు ఉన్నట్టు తెలుస్తోంది. 4 ఆయుధాలతో పాటు – 01 SLR రైఫిల్, 02 INSAS రైఫిల్స్ , 01.303 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also : Kamareddy : కామారెడ్డిలో భారీ వర్షాలు.. రైళ్ల రాకపోకలు రద్దు..

చనిపోయిన మావోయిస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగానే ఈ ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు ధృవీకరించారు. గడ్చిరోలిలో మరింత మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం ఉండటంతో.. ఈ సరిహద్దుల్లోనే కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Read Also : Floods : వరదల్లో చిక్కుకున్న 12 మంది.. సాయం కోసం ఎదురుచూపు..

Exit mobile version