Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. శని దోష నివారణ పూజల కోసం మందపల్లి వెళ్తున్నవారు ముగ్గురు, విదేశీ పర్యటన ముగించుకుని సొంత ఊరికి వెళ్లుతున్నవారిలో ఒకరు.. మృతిచెందినవారిలో ఉన్నారు.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు.
Read Also: Maharashtra: 127 గంటల పాటు డ్యాన్స్ చేసి బాలిక.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
చోడవరం నుండి టాటా మేజిక్ వాహనంలో పది మంది మందపల్లి వెళ్తున్నారు.. ఇదే సమయంలో విదేశీ పర్యటన ముగించుకుని కారులో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి సొంతూరు భీమవరం.. కారులో నలుగురు బయల్దేరారు.. అయితే, టాటామ్యాజిక్ వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడే మృతిచెందగా.. ప్రమాదంలో 9 మంది గాయాలపాలయ్యారు. ఇక, సమాచారం అందుకున్న ఆలమూరు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను.. గాయపడిన వారిని 108 సిబ్బంది సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. AP 35 W 2306 నంబర్ గల టాటా మ్యాజిక్‌వాహనంలో రంపచోడవరం నుండి మందపల్లి శనేశ్వరస్వామి దైవ దర్శనం కోసం పది మంది వస్తుండగా.. వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి AP 39 C 2266 నంబర్ గల కారులో నలుగురు వెళ్తున్నారు.. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ వాహనంలోని ముగ్గురు మృతి చెందగా.. కారులో ఉన్నవారిలో ఒకరు ప్రాణాలు విడిచారు.