Site icon NTV Telugu

Four Day Work Week: వారానికి నాలుగురోజుల పని సక్సెస్.. ఉద్యోగులు హ్యాపీ.. పెరిగిన ఉత్పాదకత

Four Day Work Week

Four Day Work Week

Four-Day Work Week: ప్రపంచంలోని చాలా దేశాలు వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని కలిగి ఉన్నాయి. కానీ కొన్ని దేశాలు నాలుగు రోజుల పని వారం షెడ్యూల్‌ను ఆమోదించాయి. యూఏఈ, స్పెయిన్, స్కాట్లాండ్ ఐర్లాండ్, న్యూజిలాండ్, జపాన్ ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరించాయి. దీంతో ఉత్పాదకతలో పెరుగుదలను నమోదు చేసినట్లు గుర్తించాయి. ఈ విషయంలో యూఏఈ (షార్జా) ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. ప్రభుత్వ అధ్యయనం ప్రకారం.. వారానికి నాలుగు రోజులే పని చేయడం వల్ల ఉద్యోగుల సంతృప్తస్థాయి, మానసిక ఆరోగ్యం వంటివి కూడా మెరుగుపడ్డాయి. దీంతో కంపెనీల్లో ఉత్పాదకత పెరిగింది. ఉద్యోగుల్లో వృత్తి పరమైన సంతృప్తి, ఉత్పాదకత 90 శాతం పెరిగాయి. ఉద్యోగుల్లో సంతోష స్థాయి కూడా 91 శాతానికి చేరుకుంది.

Read Also: Taraka Ratna: తారకరత్న కోరిక బాలయ్య తీరుస్తారా!?

సాధారణంగా ఎక్కువ రోజులు పని చేసే వాళ్లకు వర్క్ లైఫ్-పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. కానీ, నాలుగు రోజుల పని విధానం వల్ల 84 శాతం మంది ఉద్యోగులు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. వారాంతాపు సెలవుల్ని ఆస్వాదించే వారి శాతం కూడా 95 శాతం పెరిగింది. ఈ విధానం వల్ల ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే అవకాశం దొరికింది. వాళ్లు ఖాళీ సమయంలో తమకు నచ్చిన పనులు చేసుకోగలుగుతున్నారు. హాబీస్ నెరవేర్చుకుంటూ, చదువుకుంటూ, ఇతర ప్రైవేట్ జాబ్స్ చేసుకునే టైమ్ కూడా దొరుకుతోంది. ప్రభుత్వ సంస్థల్లో 88 శాతం ఉత్పాదకత పెరిగింది. ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ కూడా 81 శాతం పెరిగింది. ఉద్యోగుల హాజరు శాతం కూడా మెరుగుపడింది. సిక్ లీవ్ రేట్ 45 శాతం తగ్గింది. ప్రస్తుతం అనేక దేశాలు నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయడంపై ఆలోచిస్తున్నాయి.

Exit mobile version