NTV Telugu Site icon

Covid Positive: తెలంగాణలో కొత్తగా నలుగురికి కరోనా నిర్ధారణ

Coronavirus

Coronavirus

Covid Positive: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో 402 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 9 కొవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇటీవల రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: IAS Promotions: 14 మంది ఐఏఎస్లకు పదోన్నతులు

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను సిద్ధం చేయాలని, కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. JN.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అలర్ట్ జారీ చేసింది.

Show comments