Site icon NTV Telugu

Colombia : ‘అమ్మ చనిపోయింది..ఆకలిగా ఉంది’ అడవిలో తప్పిపోయిన చిన్నారి తొలిమాటలు

Amazon

Amazon

Colombia Plane Crash:’నాకు ఆకలిగా ఉంది, మా అమ్మ చనిపోయింది’. కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవిలో 40 రోజుల తర్వాత రక్షించబడిన నలుగురు చిన్నారుల్లో ఒకరి మాటలివి. నలుగురు పిల్లలలో ఆమె తన తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె. చిన్నారి వయసు కేవలం 13 సంవత్సరాలు. ఈ చిన్నారులు తమ తల్లితో కలిసి మే 1న చిన్న విమానంలో ప్రయాణిస్తుండగా అది అమెజాన్ అడవిలో కూలిపోయింది. విమానం కూలిన తర్వాత వారు అడవిలో కనిపించకుండా పోయాడు. ఆ ప్రమాదంలోనే వారి తల్లి మరణించింది. నెల రోజులకు పైగా దట్టమైన అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఈ నలుగురు చిన్నారులు శుక్రవారం దొరికారు. అడవి నుంచి బయటకు తీసుకొచ్చిన ఈ చిన్నారులను నేరుగా ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు.

Read Also:Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?

కాగా, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న నికోలస్ ఆర్డోనెజ్ గోమెస్ (Nicolas Ordonez Gomes).. పబ్లిక్ ప్రసార ఛానెల్ ఆర్టీవీసీతో మాట్లాడుతూ.. పిల్లల్ని కలిసిన తర్వాత మొదటి క్షణాలను వివరించారు. నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లెస్లీ వయసు 13 ఏళ్లు. ఆమె ఒక ఏడాది వయసుగల చిన్నారిని ఎత్తుకుని పరుగులు తీస్తూ తన వద్దకు వచ్చిందని చెప్పారు. లెస్లీ తన వద్దకు వచ్చి మొట్టమెదటగా ‘నాకు ఆకలి వేస్తోంది’ అని చెప్పిందన్నారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకొని ఉన్నారని.. అందులో ఒకరు లేచి ‘మా అమ్మ చనిపోయింది’ అని చెప్పాడు’అని నికోలస్ వివరించారు. వారి మాటలు విన్న తాము వెంటనే పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ‘మేం మీ స్నేహితులం. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులే పంపించారు. మీ నాన్న, మీ అంకుల్ పంపించారు’ అని పిల్లల్తో చెప్పినట్లు నికోలస్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ చిన్నారుల తండ్రి విమానంలో లేకపోవడం యాదృచ్ఛికం. ఇప్పుడు వారి పోషణ బాధ్యత అంతా తండ్రి భుజస్కందాలపైకి వచ్చింది. విమానంలో వారి తల్లితో పాటు మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం తర్వాత ఆర్మీ సిబ్బంది అందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పిల్లలు అక్కడ నుండి కనిపించకుండా ముందుకు వెళ్లిపోయారు. కాబట్టి వారిని ఆ సమయంలో రక్షించలేకపోయారు.

Read Also:Amit Shah: తెలంగాణలో అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరార్

Exit mobile version