Site icon NTV Telugu

MRPS Leader Kidnap Case: ఎమ్మాఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్..

Arrest

Arrest

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన ఎమ్మార్పీఎస్​ నాయకుడు నరేందర్‌ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముబైలో సుజాయత్ ఆలీ, అజ్మద్ ఆలీ, షకీల్, ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్నారు. 15 మంది రౌడీలు నరేందర్, ప్రవీణ్లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టి నరకం చూపించారు. పోలీసులకు భయపడి ఇద్దరినీ తమ ఇంటి వద్ద వదిలేసి ముంబైకి పారిపోయారు రౌడీలు. నార్సింగీ బృందావన్ కాలనీ సర్వే నెంబర్ 46, 47లో కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో తిష్ట వేశారు. దొంగ పత్రాలను సృష్టించి ‘Not to interference’ ఆర్డర్ తీసుకొని వచ్చారు రౌడీలు.

Heavy rain Alert: తెలంగాణకు అత్యంత భారీ వర్షసూచన.. రెడ్ అలర్ట్ జారీ

స్థలంలో 70 మంది రౌడీలతో తిష్ట వేసి ప్రహారీ గోడను నిర్మాణ పనులు చేపట్టింది ఆ గ్యాంగ్. అయితే.. ఆ స్థలం వద్దకు వెళ్లిన నరేందర్, ప్రవీణ్లను మిట్ట మధ్యాహ్నం కారులో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి నేరుగా శంషాబాద్ ధర్మగిరి సమీపంలో ఉన్న సుజాయత్ అలికి సంబంధించిన ఫామ్ హౌస్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరిని గ్యాంగ్ సభ్యులు చిత్ర హింసలు పెట్టారు. బాత్ రూమ్ లు కడిగించి, కుక్కల మల మూత్రాలు ఎత్తించి చీకటి గది‌లో బంధించి భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా ఫామ్ హౌస్ అడ్డాగా ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. అయితే.. ఆ స్థలం పై తిష్ట వేసి మనుషుల ప్రాణాలు తీసే కుక్కలను స్థలం వద్ద ఉంచి భయభ్రాంతులకు గురి చేయడమే వారి స్టైల్. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా న్యాయస్థానాన్నే బురడి కొట్టించే రకం వాళ్లు.

TG EAMCET 2024: ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంజనీరింగ్‌ ఫేజ్‌-1 సీట్ల కేటాయింపు ఆలస్యం..!

Exit mobile version