NTV Telugu Site icon

Hyderabad Crime: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో నలుగురి అరెస్ట్

New Project (1)

New Project (1)

ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. హత్య చేసిన కీలక నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్ గా తేల్చారు. వారితో పాటు శవం పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహన్ ను కూడా అరెస్ట్ చేశారు. శ్రీరాములు, రాజు అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.ఈనెల 15న గడ్డం మహేష్ ఆఫీస్ లోనే హత్య జరిగినట్టు నిర్ధారణఅయ్యింది. అదేరోజు రాత్రి శవాన్ని కారులో తరలించిన నిందితులు జేసీబీ సహాయంతో డంపింగ్ యార్డ్ లో పూడ్చారు. ఆస్తి వివాదమే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు.

READ MORE: TG: రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె..

అసలేం జరిగింది…?
ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాజీ ఎంపీటీసీ మహేశ్‌(40) ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో వాళ్లకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తాజాగా ఎఫ్‌సీ నగర్ డంపింగ్ యార్డు వద్ద ఎన్‌ఎఫ్‌సీ నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహం లభ్యమైంది. పూడ్చిన మృతదేహాన్ని స్థానిక ఎమ్మార్వో పంచనామా తర్వాత డంప్ యార్డ్ వద్దే వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. కళ్ళలో కారం చల్లి, పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడని నిర్ధారించారు. డంప్ యార్డ్ లో JCB తో పెద్ద గొయ్యి తవ్వి కారులో గడ్డం మహేష్ మృతదేహాన్ని ఉంచి కారుతో సహా పూడ్చి పెట్టినట్లు తేల్చారు.