హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం జరిగింది. చంచల్ గూడ జైలు నుంచి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విడుదల అయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను శివ బాలకృష్ణకు మంజూరు చేసింది. ఇక, ఈ రోజు ఉదయం 8 గంటలకు జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. అయితే, శివ బాలకృష్ణతో పాటు శివ నవీన్ కుమార్ కూడా ఉన్నారు. వీరు, దేశం విడిచి వెళ్లొద్దంటూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ విచారణకు సహకరించాలని నాంపల్లి ఏసీబీ కోర్టు తెలిపింది.
Read Also: Kesineni Nani: శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు
అయితే, ఆదాయానికి మించి ఆస్తులు కలిగినందుకు అక్రమాస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25వ తేదీన అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు. ఇక, రెండు లక్షల రూపాయలు పూచీకత్తు సమర్పించాలని.. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు పోలీసుల అనుమతి లేనిదే ఎక్కడికి వెళ్లొ్ద్దని నాంపల్లి ఏసీబీ కోర్టు తెలిపింది. పోలీసులకు పాస్‌పోర్టుని అప్పజెప్పాలి పేర్కొనింది. అయితే, వారికి బెయిల్ మంజూరు కావడానికి ఏసీబీ అధికారులే కారణం అయ్యారు. ఓ వ్యక్తిని ఏదైనా కేసులో అరెస్ట్ చేసినప్పుడు.. 60 రోజులలోగా ఆ వ్యక్తిపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేయాల్పి ఉంది.. కానీ, ఏసీబీ అధికారులు సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయలేదు.. దీంతో శివ బాలకృష్ణ, శివ నవీన్ ఇద్దరూ కోర్టుని ఆశ్రయించడంతో వారికి బెయిల్ మంజూరు చేసింది.