Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే షాకింగ్ ట్వీట్.. ఇదేం ట్విస్ట్

Hhvm (5)

Hhvm (5)

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా మొదలైంది. పవర్ స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమల్లు.  ఎ.ఎం. రత్నం పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.  నేడు ప్రీమియర్స్ తో విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఫ్యాన్స్  ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  వెండితెరపై పవర్ స్టార్ ను చూసేందుకు థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.

Also Read : HHVM : హరిహర వీరమల్లు ఏరియాల వారి థియేట్రికల్ రైట్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.?

అయితే వైసీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిత్యం అవాకులు చెవాకులు పేల్చే వైసీపీ పార్టీకి చెందిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హరిహర వీరమల్లునుద్దేశించి ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ పవన్ కళ్యాణ్ గారి “హరిహర వీర మల్లు” సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేసారు. ఓ వైపు అంబటి రాంబాబు పార్టీ వారు పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా కోసం అధిక ధరకు టికెట్స్ ధర పెంచాడు అని కామెంట్స్ చేస్తుంటే ఈయన ఇలా చేయడం అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీలు వేరైనా తమ హీరో సినిమాపై పాజిటివ్ ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంబటి రాంబాబుకు థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రాజకీయం రాజకీయమే.. సినిమా సినిమానే. అభిమానం అలాంటిది మరి.

Exit mobile version