Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (82) తాజాగా డెలావేర్‌లోని రిహోబోత్ బీచ్ చర్చ్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అలా వచ్చిన ఆయన చాలా బలహీనంగా కనిపించడమే కాకుండా, తలపై ఒక పెద్ద గాయం మచ్చ కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయం సంబంధించి బైడెన్ ప్రతినిధి కెల్లీ స్కల్లీ అధికారికంగా వెల్లడిస్తూ.. కొద్దీ రోజుల క్రితం ఆయన మోహ్స్ సర్జరీ చేయించుకున్నారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో చర్మంపై ఉండే క్యాన్సర్ కణజాలాన్ని పొరల వారీగా తొలగిస్తారని ఆయన పేర్కొన్నారు.
Ross Taylor: రిటైర్మెంట్‌పై రాస్ టేలర్ యూటర్న్.. కాకపోతే, ఈసారి ఆ దేశం తరుపున!
అయితే ఇదొక్కటే కాదు. బైడెన్ ప్రస్తుతం ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స కూడా పొందుతున్నారు. ఈ సంవత్సరం మార్చిలో ఆయన స్వయంగా ఈ విషయం వెల్లడించారు. మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువవడంతో చేసిన వైద్య పరీక్షల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎముకల వరకు వ్యాపించిందని తేలింది. ఇప్పుడు ఆయన కుటుంబం వైద్యులతో కలిసి చికిత్స మార్గాలపై చర్చలు జరుపుతోంది. గతంలో కూడా బైడెన్ క్యాన్సర్ సమస్యను ఎదుర్కొన్నారు.
Mirai : సెన్సార్ పనులు ముగించుకున్న ‘మిరాయ్’.. రన్‌టైమ్ ఎంతంటే ?
రెండు సంవత్సరాల క్రితం ఆయన ఛాతీ నుంచి బేసల్ సెల్ కార్సినోమా తొలగించడానికి శస్త్రచికిత్స చేశారు. మరోవైపు, బైడెన్ కుటుంబం మొత్తానికి క్యాన్సర్ సమస్యలు కొత్తవి కావు. ఆయన కుమారుడు బ్యూ బైడెన్ 2015లో మెదడు ట్యూమర్ కారణంగా మరణించగా, ఆయన భార్య జిల్ బైడెన్ కూడా చర్మ క్యాన్సర్ కు సర్జరీ చేయించుకున్నారు.
