NTV Telugu Site icon

AG Noorani: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ(93) కన్నుమూత

Agnoorani

Agnoorani

సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది, ప్రముఖ పండితుడు ఏజీ నూరానీ గురువారం ముంబైలో మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు. అత్యుత్తమ న్యాయ పండితులు, రాజకీయ వ్యాఖ్యాతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కాశ్మీర్ ప్రశ్న, బద్రుద్దీన్ త్యాబ్జీ, మంత్రుల దుష్ప్రవర్తన, ఆసియా భద్రత కోసం బ్రెజ్నెవ్ యొక్క ప్రణాళిక, ది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ది ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్ వంటి అనేక పుస్తకాలను ఆయన రాశారు. ఏజీ నూరానీ రాసిన కాలమ్‌లు హిందుస్థాన్ టైమ్స్, ది హిందూ, ది స్టేట్స్‌మన్ వంటి వివిధ పత్రికల్లో వచ్చాయి.

ఇది కూడా చదవండి: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో టీమిండియా క్రికెటర్లు వీళ్లే

1930లో బొంబాయిలో ఏజీ నూరానీ జన్మించారు. 1960 ప్రారంభంలో రాయడం ప్రారంభించి వందలాది వ్యాసాలను రూపొందించారు. న్యాయవాదిగా బాంబే హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు. రాజకీయ ప్రత్యర్థి జయలలితకు వ్యతిరేకంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తరపున ఆయన హైకోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. ఏజీ నూరానీ మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు సంతాపం తెలిపాయి. నూరానీ మరణం బాధాకరమని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా సంతాపం తెలిపారు. పండితుల్లో ఒక దిగ్గజం కోల్పోయామని చెప్పారు.