Site icon NTV Telugu

Meira Kumar: హైదరాబాద్ కు మాజీ స్పీకర్ మీరా కుమార్.. ఘన స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

Meera Kumar

Meera Kumar

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు (జూన్ 2న) హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ వేడుకలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు విమానంలో వచ్చారు. మీరా కుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువరు మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

Also Read : Himaachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం.. లోయలో పడ్డ బస్సు..

యూపీఏ సర్కారు తెలంగాణ ఇచ్చిన సమయంలో మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు. రేపు ( శుక్రవారం ) ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ జరుగనుంది. అనంతరం ఉ. 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం స్టార్ట్ అవుతుంది.

Also Read : RBI: ‘100 డేస్ 100 పేస్’ ప్రచారాన్ని ప్రారంభించిన RBI

ఈ పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర అబిడ్స్ నెహ్రూ విగ్రహం మీదుగా గాంధీభవన్ కు చేరుకుంటుంది. అనంతరం గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభం కానుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో సన్మానిస్తారు.

Exit mobile version