NTV Telugu Site icon

Haryana : దారుణం.. ఆర్నెళ్ల పాపతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన జవాన్

New Project 2024 07 22t140902.454

New Project 2024 07 22t140902.454

Haryana : హర్యానాలోని అంబాలాలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు సమాచారం. మృతులను 65 ఏళ్ల తల్లి సరోపి దేవి, 35 ఏళ్ల సోదరుడు హరీష్ కుమార్, హరీష్ భార్య సోనియా (32), కుమార్తె యాషిక (5), 6 నెలల కుమారుడు మయాంక్‌గా గుర్తించారు.

Read Also:Andhra Pradesh: చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష భేటీ.. హాజరైన పవన్‌

నిందితుడి పేరు భూషణ్ కుమార్ అని అధికారులు తెలిపారు. ఆ రాత్రి తన సోదరుడిపై మొదట పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తాన్ని ఒక్కొక్కరిగా చంపేశాడు. మృతదేహాలను కాల్చడానికి కూడా ప్రయత్నించాడు. భూషణ్ తన తండ్రి, సోదరుడు హరీష్ పెద్ద కుమార్తెపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Read Also:Telangana Cabinet: 317 జీవో పై క్యాబినెట్ సబ్‌క‌మిటీ భేటీ.. హాజరైన ముగ్గురు మంత్రులు

ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూమి విషయంలో గొడవలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నారాయణగఢ్‌లోని రాటౌర్‌లో వారిద్దరికీ ఒక భూమి ఉంది. ఘటన జరిగిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుందని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. నిందితుడు భూషణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Show comments